Advertisement
మార్కెట్లో మనకు రక రకాల పండ్లు లభిస్తుంటాయి. కొన్ని సీజన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక కొన్ని ఎప్పుడైనా సరే లభిస్తాయి. అలాగే లోకల్‌గా పండించిన పండ్లు అయితే వాటిపై స్టిక్కర్లు దాదాపుగా ఉండవు. కానీ పండ్ల మార్కెట్‌లలో చాలా వరకు అమ్మే పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. అవును.. వాటిని ఎప్పుడైనా మీరు గమనించారా ? అసలు ఆ స్టిక్కర్లను ఎందుకు వేస్తారు ? పండ్లపై ఉండే ఆ స్టిక్కర్లకు అసలు అర్థమేమిటి ? అంటే…
పండ్లపై వేసే స్టిక్కర్లు మనకు రకరకాల అర్థాలను తెలియజేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* పండ్లపై వేసే స్టిక్కర్లు 5 అంకెల కోడ్‌ను కలిగి ఉండి, అవి 9 అనే నంబర్‌తో ప్రారంభమైతే ఆ పండ్లను పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండించినట్లు అర్థం చేసుకోవాలి.
Advertisements
Advertisement
* స్టిక్కర్లపై కోడ్ 5 అంకెలు ఉండి, ఆ కోడ్ 8 అనే నంబర్ తో ప్రారంభమైతే ఆ పండ్లను కూడా సేంద్రీయంగానే పండించినట్లు తెలుసుకోవాలి. కాకపోతే వాటిని జన్యుపరంగా మోడిఫై చేశారని అర్థం చేసుకోవాలి.
* పండ్లపై వేసే స్టిక్కర్లపై 4 అంకెల కోడ్ ఉంటే ఆ పండ్లను కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడి పండించినట్లు అర్థం చేసుకోవాలి.
* సాధారణంగా 4 అంకెల కోడ్‌లలో నంబర్లు 3 లేదా 4 తో ప్రారంభమవుతాయి. అదే 5 అంకెల కోడ్‌లలో నంబర్లు 8 లేదా 9 తో ప్రారంభమవుతాయి.
Advertisements
* కొన్నిసార్లు పండ్లపై GMO లేదా Non GMO అనే స్టిక్కర్లను కూడా వేస్తారు. జీఎంవో అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ అని.. నాన్ జీఎంవో అంటే నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ అని అర్థాలు వస్తాయి. అంటే జన్యుపరంగా మార్పులు చేసి పండ్లను పండించారని జీఎంవో సూచిస్తుంది. అలా పండించలేదనే అర్థాన్ని నాన్ జీఎంవో సూచిస్తుంది. ఈ క్రమంలో జీఎంవో పండ్లను తినకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే పైన తెలిపిన 4 అంకెల కోడ్ ఉండే పండ్లను కూడా తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే వాటిని కృత్రిమ ఎరువులను వాడి పండించారు కనుక. ఇలా పండ్ల మీద ఉండే స్టిక్కర్లు అర్థాలను తెలియజేస్తాయి.