Advertisement
పచ్చిమిర్చి వాడటం మంచిదా… లేక కారం వాడటం మంచిదా అనే దాని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పచ్చి మిర్చి తింటే గ్యాస్ వస్తుందనే భయం చాలా మందిలో ఉంది. కారం వాడితే బీపీ పెరుగుతుంది అని భయపడి రుచి లేకుండానే అన్నీ తింటున్నారు. అసలు పచ్చి మిర్చితో ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:బస్సు అద్దాలు ఎందుకు చిన్న చిన్న ముక్కలు అవుతాయి…?
పచ్చిమిర్చి లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ వ్యవస్థకు ఇది చాలా మంచిది. విటమిన్ బి6, ఏ, ఐరన్, కాపర్, పొటాషియం సహా… కొద్ది మొత్తంలో ప్రొటీన్లు కార్బోహైడ్రైట్స్ కూడా ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. విటమిన్ సి తో… చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. పచ్చిమిర్చి తినడంతో… ఉమ్ము ఎక్కువగా వస్తుంది. ఇది నోటికి తినే ఆహారానికి ఎంతో మంచి చేస్తుంది.
Advertisement
Advertisements
ఇక శరీరంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని వాడితే కొవ్వు కరిగిపోతుంది. పచ్చిమిర్చి ని నేరుగా వాడలేని వారు ఒక పని చేయవచ్చు. తినే శనగపప్పులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని నంచుకుని స్నాక్స్ లా తినండి. పచ్చి మిర్చి తో అనవసర సమస్యలు ఏమీ ఉండవు. ఏదైనా మితంగా తింటే ఏ సమస్య ఉండదు గాని… ఇక దొరకదు అని తింటే సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
Advertisements