Advertisement
జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో సరైన ప్లానింగ్ తో పెడితే దాదాపు ఏ వ్యాపారం అయినా సరే హిట్ అవుతుంది. మనుషుల అవసరాలు, వస్తువుల డిమాండ్ కూడా పెరుగుతుంది. వ్యాపారం చేయడానికి చిన్నది అయినా పెద్దది అయినా మంచి ప్లాన్ తో వెళ్ళాలి. ఇక అసలు విషయానికి వస్తే చాలా మంది హైవేల మీద వ్యాపారాలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే అందులో ఏ వ్యాపారం పెట్టాలి అనేది అవగాహన లేక ఏవేవో పెడతారు.
కాబట్టి హైవేల మీద వ్యాపారం ఏది పెడితే బాగుంటుంది అనేది చూద్దాం. ఏదో నాకు తెలిసినది చెప్తున్నాను, ఈ విషయంలో నేనేమీ ఎక్స్పర్ట్ ని అయితే కాదు.
హైవే లలో సాధారణంగా ఎవరూ ఆగరు కనక పెద్దగా వ్యాపారం ఏమీ జరగదు. కానీ కొన్ని ఎమర్జెన్సీ వస్తువులు అమ్మకానికి పెడితే కాస్తో కూస్తో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సహా కార్ లో వెళ్ళేవాళ్ళకి ఉపయోగపడే వస్తువులు.
Advertisement
1; మోబైల్ ఛార్జర్స్, పవర్ బ్యాంకులు. కాకపోతే తక్కువ ధరలోవి పెట్టాలి.
2; ప్రాధమిక చికిత్స కిట్స్
3; పిల్లలకి చిరుతిళ్లు.
Advertisements
4; ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు.
5; మంచినీళ్ల బాటిల్స్, కూల్ డ్రింకులు
6; పిల్లల బొమ్మలు, రకరకాల ఆటవస్తువులు ,డైపర్ లు ,
7; లగేజ్ బ్యాగులు
8; గొడుగులు, గాగల్స్.
9; కాఫీ, టీ, టిఫిన్స్, భోజనం, స్నాక్స్ వగైరా దొరికే కేఫ్/ రెస్టారెంట్ విత్ అటాచ్డ్ వాఁష్రూమ్స్. వాష్ రూమ్ ఉంటే ఫ్యామిలీలు ఎక్కువగా ఆగుతాయి. ఫ్యామిలీ ఆగితే ఆ బిజినెస్ తెలిసిందేగా, అలాగే స్త్రీలు కూడా ఎక్కువగా ఆగే అవకాశం ఉంటుంది.
10; కార్, బైక్ రిపేర్ సెంటర్ .
Advertisements
Also Read: ఉదయ్ కిరణ్ నటించిన ఈ సినిమా, నటులకు శాపమా…? ఎంత మంది చనిపోయారో చూడండి…!