Advertisement
స్మార్ట్ పరికరాలు అన్నీ కూడా మన జీవితంలో భాగం అయ్యాయి. వాటితో మనం ఎన్నో పనులు సులువుగా చేసేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఇక గూగుల్ విషయానికి వస్తే… గతంలో థింక్ బిఫోర్ టాక్ అనే వాళ్ళు. ఇప్పుడు గూగుల్ బిఫోర్ టాక్ అనేస్తున్నారు. సరే గాని గూగుల్ అసిస్టెన్స్ ఏయే పనులు చేయవచ్చో ఒకసారి చూద్దాం.
Also Read:బస్సు అద్దాలు ఎందుకు చిన్న చిన్న ముక్కలు అవుతాయి…?
1. పరికరాలను మరియు స్మార్ట్ ఇంటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫ్యాన్ లేదా లైట్లను ఆన్ చేసేయొచ్చు. స్పీడ్ కంట్రోల్ కూడా చేయవచ్చు.
Advertisement
2. మన క్యాలెండర్లు, ఫోన్ కాంటాక్టులు మరియు ఇతర వ్యక్తిగత సమాచారం నుండి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.
Advertisements
3.రెస్టారెంట్ బుకింగ్‌లకు ఆదేశాలు, వాతావరణం మరియు వార్తల వరకు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెతకవచ్చు.
4. సంగీతాన్ని నియంత్రించవచ్చు. Chromecast లేదా ఇతర అనుకూల పరికరాల్లో కంటెంట్‌ను ప్లే చేయొచ్చు.
5. టైమర్‌లు మరియు రిమైండర్‌లను సెట్ చెయ్యొచ్చు.
6. SMS, ఇమెయిల్ సందేశాలు పంపవచ్చు.
7. ఫోన్‌లో అనువర్తనాలను(అదేనండి అప్లికేషన్స్ ను) తెరవవచ్చు.
8. వచ్చిన నోటిఫికేషన్‌లను చదివి వినిపించమని కోరవచ్చు.
9. రియల్ టైమ్లో మాటలకు అనువాదాలు వినవచ్చు.
Advertisements