Advertisement
క్రికెట్ చూడటానికి బాగుంటుంది గాని ఆడే వాళ్లకు మాత్రం సినిమా కనపడుతుంది. ఆ బాల్ ఒకసారి సరిగా తగిలితే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇక ఆటగాళ్ళు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక ఫీల్డింగ్ చేసే సమయంలో ఆటగాళ్లకు దెబ్బలు తగలకుండా ఉండటానికి ఏం చేస్తారో ఒకసారి చూస్తే…
Also Read:క్రికెట్ లో ఎవరికి తెలియని రూల్, లక్ష్మణ్ ను కాపాడిన గంగూలి…!
క్రికెట్ ఫీల్డర్లు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి, ఆపడానికి దూకడం, ఎగరడం వంటివి ఎక్కువగా చేస్తారు. మరి వారి ఎముకలు విరగడం, కండరాలు దెబ్బతినడం ఎందుకు జరగదు అనే ప్రశ్నలు ఉంటాయి. స్లిప్, పాయింట్, షార్ట్ ఫైన్ లెగ్ ఇలాంటి స్థానాల్లో లో ఫీలింగ్ చేసేవారిని ఎప్పుడైనా గమనిస్తే, వారి చేతి వేళ్లకు ఎప్పుడూ బ్యాండేజ్ ఉంటుంది. దీనితో వేగంగా వచ్చిన బంతి అంత గట్టిగా తగిలే అవకాశం ఉండకపోవచ్చు.
Advertisement
Advertisements
గతంలో ఏమైనా గాయాలు ఉంటే అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ మోచేతిని మరియు మోకాలు ని కప్పి ఉంచేలా (దెబ్బ తగలకుండా) ఎల్బో మరియు నీ క్యాప్ ను ధరించడం చూస్తూ ఉంటాం. ఇలా చేయడంతో వాళ్ళ కాళ్ళు బెణకకుండా ఉంటాయి. కెప్టెన్ ఎప్పుడు ఫీల్డింగ్ చేసే సమయంలో తన ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక పేస్ బౌలర్లను ఫీల్డింగ్ లో నిలబెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలావరకూ థర్డ్ మ్యాన్, ఫైన్ లెగ్, మిడ్ ఆఫ్ స్థానాల్లో వీరిని ఫీల్డింగ్ లో ఉంచుతారు.
Advertisements
Also Read:సచిన్ ఫస్ట్ మ్యాచ్ ఆడింది పాకిస్తాన్ తరుపునా…? ద్రావిడ్ గంగూలి అనుబంధానికి ఇదే ఉదాహరణ…!