Advertisement
ఒపెక్ దేశాలు ఇప్పుడు చమురు ఉత్పత్తి మీద ఎక్కువగా ఫోకస్ చేసాయి. అమెరికా సహా చాలా దేశాల్లో చమురు ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఈ దేశాలు అన్నీ సీరియస్ గా దృష్టి సారించాయి. ఇక చమురు ఉత్పత్తుల ద్వారానే ఆయా దేశాలకు లాభం ఎక్కువగా వస్తుంది. ప్రభుత్వాలు కూడా ఆ ఆదాయం మీదనే నడుస్తున్నాయి. మరి అక్కడ ఆయిల్ అయిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తారు…?
Also Read:కరెంట్ షాక్ కొడితే ఏం జరుగుతుంది…?
Advertisement
ఉదాహరణకు సౌదీ అరేబియాను తీసుకుంటే… ఆ దేశం కేవలం చమురు ద్వారానే సంపన్న దేశంగా మారిందనే చెప్పాలి. దుబాయి తరహాలో పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తులు రోజుకి సగటున ఒక లక్ష బారెల్స్ వరకు చేరుకున్నాయని చెప్పాలి. సగటున రోజుకి మొత్తం 6.95 మిలియన్ల బారెల్స్ ని ఉత్పత్తి చేస్తున్నారట. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు.
ఇక అక్కడ చమురు అయిపోతే మక్కా వంటి ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల ద్వారా ఆదాయం బాగా వస్తుంది. కేవలం చమురు మీదే ఆధార పడకుండా, గత 4 సంవత్సరాలనుండి కొన్ని కొత్త చట్టాలు తెచ్చారు. అంటే దాని ప్రకారం చూస్తే ఆధార రుసుము కట్టాల్సి ఉంటుంది. ప్రతీ ఒకరికి నెలకు 400 రియాలు కట్టాల్సి ఉంటుంది. మన కరెన్సీ లో 8 వేల రూపాయలు. ఇక 15% పన్ను ప్రతీ కొనుగోలు పై కట్టాల్సి ఉంటుంది.
Advertisements
Advertisements
Also Read:అమెజాన్ ప్రైమ్ లో ఒకే సినిమాను ఎన్ని డివైజ్ లలో చూడవచ్చు…?