Advertisement
ఈ రోజుల్లో ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టంగా మారిన విషయం. ఉద్యోగాల కోసం చాలా కష్టపడుతున్నారు కొందరు. ఇక ఉద్యోగం కోసం నకిలీ అనుభవ పత్రాన్ని కంపెనీలకు ఇస్తున్నారు. దీని వలన నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే… దొరికితే సమస్యలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో చూద్దాం.
Also Read: అసలు మైసూరు బజ్జీ ఎక్కడ పుట్టింది…? నిజంగా మైసూరు నుంచే వచ్చిందా…?
మొదట్లో దొరికితే అది లీగల్ సమస్య కూడా అయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఉద్యోగి కొన్నేళ్ళు పని చేసిన తర్వాత ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఉద్యోగం సంపాదించాడని తెలిస్తే ఏం చేస్తారు అంటే… 99 శాతం ఏం చేసే అవకాశం ఉండదు. నూటికి 90 మంది ఎక్స్‌పీరియన్స్ ను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళే ఉంటారు. అందరికీ క్యాంపస్ లో జాబ్ వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. అనుభవం లేదంటే మాత్రం జాబ్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరంగా మారింది.
Advertisement
Advertisements
ప్రతి కంపెనీ ఎంప్లాయ్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కచ్చితంగా ఉంటుంది. కొన్ని రోజులు పని చేసిన తర్వాత మళ్ళీ మళ్లీ వెరిఫికేషన్ చేయడం దాదాపుగా జరగదు. అది కచ్చితంగా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ఒకవేళ చేసినా సరే… అతను ఉద్యోగం సమర్ధవంతంగా చేస్తుంటే మాత్రం పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు. నెగటివ్ రిపోర్ట్ వచ్చినా చూసి చూడనట్టు వదిలేస్తారు. ఫేక్ పెట్టి… ఉద్యోగంలోకి వెళ్లి ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగి మీరు ఫేక్ పెట్టారని గనుక తెలిస్తే మాత్రం… సమర్ధవంతంగా పని చేస్తూ… మంచి ఆఫర్ వచ్చి, మీరు జాబ్ మారాలి అనుకుంటే ఇబ్బంది పెట్టె అవకాశం ఉంటుంది.
Advertisements
Also Read: అసలు జడ ఇండియా సంస్కృతి కాదా…? ఎక్కడి నుంచి వచ్చింది…?