Advertisement
టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఏ స్టైల్ అంటే చాలా మంది చెప్పేది చైనామన్ బౌలింగ్ అంటారు. అసలు క్రికెట్ లో చైనామన్ బౌలింగు అంటే ఏమిటి…? ఒకసారి చూస్తే… క్రికెట్ లో లెగ్ స్పిన్ బౌలింగ్ అంటే బ్యాట్స్మెన్ కాళ్ళ దగ్గర నుండి బంతి వికెట్ల వైపుగా తిరిగేలా బంతి వెయ్యడాన్ని లెగ్ స్పిన్ అని పిలుస్తారు. ఈ లెగ్ స్పిన్ ని వేళ్లతో అలాగే చేతి మణికట్టు ను తిప్పడం ద్వారా కూడా వేసే అవకాశం ఉంది.
Also Read:హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!
Advertisement
ఇలా కుడి చేతితో వేసే వాళ్ళల్లో ప్రముఖ క్రికెటర్ షేన్ వార్న్. ప్రస్తుత భారత బౌలర్ యుజ్వెంద్ర చాహల్ కూడా ఇలాగే బౌలింగ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇదే విధంగా ఎడమ చేతి వాటం ఉన్నవాళ్ళు మణికట్టు నీ ఉపయోగించి లెగ్ స్పిన్ వేస్తే దాన్ని చైనా మన్ అంటారు. దీన్ని మొదటి సరిగా ఎల్లిస్ అచొంగ్ అనే చైనా మూలాలు ఉన్న వెస్టిండీస్ ఆటగాడు,వాల్టర్ రాబిన్స్ అనే ఇంగ్లాండ్ క్రికెటర్ కి వేయడం జరిగింది.
Advertisements
అసలే ఎడమ వాటం బౌలింగ్ కావడం అందులో రిస్ట్ స్పిన్ దెబ్బకు ఆయన ఔట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తూ వెళ్తూ అంపైర్ తో సదరు బ్యాట్స్మెన్ బ్లాడి చైనామన్ అని అన్నాడు. ఇక అప్పటి నుంచి అది చైనామన్ బౌలింగ్ అయిపోయింది. ఆ బౌలర్ కి చైనా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి అలా లెఫ్ట్ హ్యాండ్ తో ఎవరు బౌలింగ్ చేసినా సరే చైనామన్ అయిపోయింది.
Advertisements
Also Read:సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?