Advertisement
కొరోనా కారణంతో లాక్ డౌన్ అనే కొత్త పదం పరిచయం అయ్యింది. దీనికి తోడు ఇంతకు ముందే మనకు తెల్సిన కర్ఫ్యూ, 144 సెక్షన్ అనే పదాలు మనల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అసలు ఈ మూడింటికి తేడా ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం.!
లాక్‌డౌన్ :
1897 ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం లాక్‌డౌన్‌ను అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజలు ఒక చోట గుమ్మిగూడు అవకాశం ఉండదు. అయితే హాస్పిటళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు, కిరాణా షాపులు, కూరగాయలు, పాలు తదితర నిత్యావసరాల షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో హోటల్స్‌ను కూడా ఓపెన్ చేయవచ్చు. మీడియాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఉండాలి. అలాంటి సందర్భంలో పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేసి వారిని తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పవచ్చు. అయినప్పటికీ వారు వినకపోతే వారిని పోలీసులు అరెస్టు చేయవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ ( IPC) 269, 270 సెక్షన్ల ప్రకారం పోలీసులకు అలాంటి వారిని అరెస్టు చేసే అధికారాలు ఉంటాయి. ఇక క్వారంటైన్‌లో ఉన్నవారు తప్పించుని పోతే వారిపై ఐపీసీ సెక్షన్ 271 కింద కేసు పెట్టవచ్చు.
Advertisement
సెక్షన్ 144 :
Advertisements
నిర్దిష్టమైన ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తే.. ఆ ప్రాంతంలో ఎప్పుడూ 5 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఒకే చోట గుమిగూడకూడదు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేస్తారు.
Advertisements
కర్ఫ్యూ :
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లకు ఏదైనా ఒక ప్రాంతంలో కర్ఫ్యూ విధించేందుకు అధికారాలు ఉంటాయి. అక్కడ సెక్షన్ 144 కూడా అమలులో ఉంటుంది. దీంతోపాటు నిత్యావసర సేవలను కూడా నిలిపివేస్తారు. కేవలం హాస్పిటళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు, బ్యాంకులు, కిరాణా షాపులు, కూరగాయలు, పాల దుకాణాలను మూసి వేస్తారు. కర్ఫ్యూ ఉన్న ప్రాంతంలో కేవలం పరిపాలన విభాగం అధికారులు, పోలీసులు మాత్రమే రహదారులపై తిరిగేందుకు అధికారాలు ఉంటాయి. ఇతరులెవరినీ రోడ్లపైకి అనుమతించరు. మీడియా అయితే పాసులు తీసుకోవాలి. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు.