Advertisement
అయోధ్యలో ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ వెండి ఇటుకతో భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. అయితే రామ మందిరాన్ని పూర్తిగా నగర నిర్మాణ శైలిలో నిర్మించనున్నారు. ఈ క్రమంలో అసలు నగర నిర్మాణ శైలి అంటే ఏమిటి ? అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. నగర నిర్మాణ శైలి అంటే.. ఉత్తర భారత ఆలయ నిర్మాణశైలి అన్నమాట.
సహజంగానే మన దేశంలో హిందూ ఆలయాలు ఉత్తర భారతదేశంలో ఒకలా.. దక్షిణ భారత దేశంలో మరొకలా నిర్మాణశైలిని కలిగి ఉంటాయి. ఇక అయోధ్య నగరం ఉత్తర భారతదేశంలో ఉంది కనుక అక్కడ రామాలయాన్ని కూడా అదే శైలిలో నిర్మిస్తున్నారు. అందుకనే దాన్ని నగర నిర్మాణశైలి అన్నారు. ఇందులో భాగంగా రామ మందిరాన్ని భిన్న భాగాలుగా నిర్మిస్తారు.
ఆలయ నిర్మాణం మొత్తం జగతి అనబడే ఆధారంపై నిర్మాణమవుతుంది. ఆలయ గర్భగుడి ముందు భాగంలో మండపాలు ఉంటాయి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ పథం ఉంటుంది. గర్భగుడి మీద శిఖరం ఉంటాయి. శిఖరం మీద కలశ, ధ్వజలు ఉంటాయి. ఈ నిర్మాణశైలిలో ఆలయానికి ప్రత్యేకంగా ప్రహారీలు అంటూ ఏమీ ఉండవు.
ఆలయాలు 4 భాగాలను మాత్రం కచ్చితంగా కలిగి ఉంటాయి.
Advertisements
Advertisement
1. గర్భగుడి – ఇందులోనే ఆలయ మూలవిరాట్టు కొలువై ఉంటాడు/ఉంటుంది. దేవుడు, దేవతల ప్రధాన విగ్రహాలు గర్భగుడిలోనే ఉంటాయి.
2. మండపం – దైవాన్ని దర్శించుకునేందుకు వచ్చిన వారు, దర్శించుకుని వెళ్లేవారు మండపాల్లో కొంత సేపు విశ్రాంతి తీసుకుంటారు.
3. ఉత్తర, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలి ఏదైనా సరే.. ఆలయానికి కచ్చితంగా శిఖరం ఉంటుంది. కాకపోతే అది భిన్నమైన ఆకృతుల్లో ఉంటుంది.
4. ఆలయంలో కొలువై ఉన్న దైవానికి సంబంధించిన వాహన విగ్రహాన్ని గర్భగుడి ఎదురుగా దైవం చూసేట్లు ఏర్పాటు చేస్తారు.
ఇలా ఆలయాల్లో మొత్తం 4 ప్రధాన భాగాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కానీ.. నిర్మాణశైలి మాత్రం ఉత్తర, దక్షిణ భారతాల్లో భిన్నంగా ఉంటుంది.
Advertisements
ఉత్తర, దక్షిణ భారత దేవాలయాల్లో ఉండే ప్రధాన తేడా.!
- ఉత్తర భారత దేశంలో నగరశైలిలో ఆలయాలను నిర్మిస్తారు. దక్షిణ భారతదేశంలో….ద్రావిడ, వెసర శైలిలో ఆలయాలను నిర్మిస్తారు.
- ఉత్తర భారత దేశంలో ఆలయాలు చిన్నవిగా ఉంటాయి…దక్షిణ భారతదేశంలో ఆలయాలు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి.
- దక్షిణ భారతదేశ ఆలయాల్లో …రెండు రకాల దేవుడి విగ్రహాలు ఉంటాయి 1)మూలవిరాట్ 2) ఉత్సవ మూర్తి…
- ఉత్తర భారత దేశ ఆలయాల్లో ….కేవలం మూలవిరాట్ మాత్రమే కనిపిస్తుంది!
- ఎక్కువ ఎత్తు ఉండే గోపురాలు మనకు ద్రావిడ శైలిలో నిర్మించిన ఆలయాల్లో మాత్రమే కనిపిస్తాయి.