Advertisement
రంజాన్ అనేది …చాంద్రమాన క్యాలెండరు ను అనుసరించి వచ్చే 9 వ నెల. ఈనెల ముస్లిములకు అత్యంత పవిత్రమైనది. వారి మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలో ఆవిర్భవించడమే దీనికి కారణం. ‘పండుగ ‘ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. మానావాళికి హితాన్ని బోధిస్తుంది.సింపుల్ గా చెప్పాలంటే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం’.
ఉపవాసాలు ఎందుకు?
ఇస్లాం లో ప్రధానంగా…ముస్లిములు పాటించాల్సిన 5 విధులు ఉంటాయి. అవి 1.దైవదూత పై నమ్మకం, 2.నమాజు , 3.జకాత్ ( దానం చేయడం), 4.రోజా ( ఉపవాసం ఉండడం), 5.హజ్( మక్కాను సందర్శించడం) ఒక సర్వే ప్రకారం ….రంజాన్ లో ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల మంది ఉపవాసాలుంటారట.!
ఉపవాసానికి 4 కారణాలు :
Advertisement
- ఉపవాస విధిని గురించి ఖురాన్ లో ఇలా చెప్పబడింది. “గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో…అలాగే మీలోభయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసవ్రతాలు నిర్ణయించబడ్డాయి’ …తమ మత గ్రంథం లో ఉంది కాబట్టి ఫాలో అవ్వడం.
- చెడు మరియు పాపం నుండి తమను తాము మార్చుకోవడం. ౩౦ రోజుల కాలంలో తమలోని చెడు అలవాట్లను విడనాడి మంచిని స్వీకరించి …వాటినే కొనసాగించడానికి సరైన కార్యక్రమం ఈ ఉపవాసం.
- స్వీయ నియంత్రణ …. తమ కోరికలను అదుపులో ఉంచుకునే తత్వం అలవడుతుంది.
- చివరిది మరియు నా దృష్టిలో ముఖ్యమైనది…..పేదోడి ఆకలి బాధ గురించి ప్రత్యక్షంగా అనుభవిస్తూ తెలుసుకోవడం తద్వారా పేదోళ్లను చులకన భావంతో చూడకపోవడం..దాన గుణాన్ని పెంపొందించడం.
Advertisements
Advertisements
NOTE: ఒకటో కారణం మినహాయించి మిగిలిన కారణాలు ….ప్రతి మతం చేపట్టే ఉపవాసాలు కారణాలే అనేది నా అభిప్రాయం.
రంజాన్ మాసం లో మీకు వినిపించే పదాలు వాటి వివరణ
- రోజా – ఉపవాసం
- సహర్- సూర్యోదయానికి ముందు ఉపవాసం చేయదలుచుకున్న వారు చేసే భోజనం
- ఇఫ్తార్ – సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని వీడి చేసే భోజనం
- జకాత్ – తమ సంపదల ప్రకారం ….పేదలకు దానం చేయడం.