Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి ? క్రికెట్ చ‌రిత్ర‌లో ఇందుకు భారీ మొత్తం ఫైన్ క‌ట్టిన ప్లేయ‌ర్స్ ఎవ‌రు??

Advertisement

క్రికెట్‌లో మ‌న‌కు స్లో ఓవ‌ర్ రేట్ అనే ప‌దం త‌ర‌చూ వినిపిస్తూనే ఉంటుంది. మ్యాచ్ లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా కెప్టెన్‌కు, ప్లేయ‌ర్ల‌కు ఫైన్ విధించారు. ప్లేయ‌ర్ల‌పై కొన్ని మ్యాచ్‌ల‌కు నిషేధం విధించారు. అనే మాట‌ల‌ను మ‌నం త‌ర‌చూ వింటుంటాం. అయితే స్లో ఓవ‌ర్ రేట్ అంటే ఏమిటి ? దీని వల్ల కెప్టెన్ ఎందుకు ఫైన్ క‌ట్టాలి ? క‌్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ మొత్తంలో ఇందుకు ఫైన్ క‌ట్టిన కెప్టెన్లు ఎవ‌రు ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

క్రికెట్‌లో 3 ర‌కాల ఫార్మాట్లు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వ‌న్డేలు, టీ20లు, టెస్ట్‌లు. వ‌న్డేలు, టీ20ల‌లో రూల్స్ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. టెస్టు క్రికెట్ రూల్స్ వేరేగా ఉంటాయి. వ‌న్డేలు, టీ20ల‌లో అయితే ఫీల్డింగ్ టీం మ్యాచ్‌లో గంట‌కు 15 ఓవ‌ర్లు కచ్చితంగా బౌల్ చేయాలి. అంటే వ‌న్డే మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌ను సుమారుగా మూడున్నర గంట‌ల్లోగా ముగించాలి. అదే టీ20లు అయితే గంట‌న్న‌ర (90 నిమిషాలు) లోగా ఒక ఇన్నింగ్స్‌ను ముగించాలి. అలా కాకుండా బౌలింగ్ లేట్ చేస్తే.. అంటే గంట‌కు 15 ఓవ‌ర్లు బౌల్ చేయ‌కుండా త‌క్కువ ఓవ‌ర్ల‌ను బౌల్ చేస్తే దాన్ని స్లో ఓవ‌ర్ రేట్ అంటారు. ఇందులో గంట‌కు కొన్ని ఓవ‌ర్ల‌ను న‌ష్ట‌పోతారు. దీని వ‌ల్ల ఇన్నింగ్స్ ఆడే స‌మ‌యం పెరుగుతుంది. ఫ‌లితంగా కెప్టెన్ తోపాటు కొన్ని సంద‌ర్భాల్లో ప్లేయ‌ర్లు కూడా అందుకు బాధ్యులు అవుతారు.

Advertisement

 

వ‌న్డేలు, టీ20లు ఎందులో అయినా స‌రే ఫీల్డింగ్ జ‌ట్టు ఒక ఓవ‌ర్‌ను 4 నిమిషాల్లో వేయాలి. అంటే గంట‌కు సుమారుగా 15 ఓవ‌ర్లు బౌల్ చేయాలి. అంత క‌న్నా త‌క్కువ బౌల్ చేస్తే దాన్ని స్లో ఓవ‌ర్ రేట్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఇక టెస్టుల్లోనూ ఇదే ఫార్ములా వ‌ర్తిస్తుంది. గంట‌కు 15 ఓవ‌ర్ల చొప్పున ఒక రోజు మ్యాచ్‌లో 90 ఓవ‌ర్లు వేయాలి. త‌క్కువ‌గా వేస్తే స్లో ఓవ‌ర్ రేట్ అంటారు. ఇక ఇన్నింగ్స్ ముగిశాక అంపైర్లు ఓవ‌ర్ రేట్‌ను లెక్కిస్తారు. అందులోనుంచి ప్లేయ‌ర్ల‌కు గాయాల‌ వ‌ల్ల గ‌డిచిన స‌మ‌యం, డ్రింక్స్ స‌మ‌యం, ఇత‌ర స‌మాయ‌ల‌ను తీసేస్తారు. ఈ క్ర‌మంలో ఓవ‌ర్ రేట్‌ను లెక్కిస్తారు. గంట‌కు 2 ఓవ‌ర్ల వ‌ర‌కు త‌క్కువ‌గా వేసిన‌ట్లు నిర్దారిస్తే అది అంత తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించ‌రు. అలాంటి సంద‌ర్భాల్లో కెప్టెన్ కు 10 నుంచి 15 శాతం వ‌ర‌కు మ్యాచ్ ఫీజులో ఫైన్ విధిస్తారు. అదే 2 ఓవ‌ర్లు మించి ఓవ‌ర్ల‌ను త‌క్కువగా వేసిన‌ట్లు నిర్దారిస్తే దాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అప్పుడు కెప్టెన్‌కు 20 శాతం, ప్లేయ‌ర్ల‌కు ఒక్కొక్క‌రికి 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. అలాగే ఆ త‌ప్పును ప‌దే ప‌దే చేస్తే కెప్టెన్‌ను త‌దుప‌రి మ్యాచ్‌లు ఆడ‌కుండా నిషేధం విధిస్తారు. అదే టెస్టుల‌కు అయితే 5 ఓవ‌ర్ల వ‌ర‌కు త‌క్కువ‌గా వేసినా దాన్ని స్వల్ప నేరంగానే ప‌రిగ‌ణిస్తారు. 5 ఓవ‌ర్లు మించితే తీవ్ర‌మైన నేరం అవుతుంది. అలాంటి సంద‌ర్భాల్లో ముందు తెలిపిన విధంగా శిక్ష‌లు వేస్తారు. ఇక ఇవే రూల్స్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశీయ క్రికెట్ మ్యాచ్‌ల‌లోనూ ఫాలో అవుతున్నారు.

అయితే క్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రిక్కీ పాటింగ్‌, గ్రేమ్ స్మిత్‌, సౌర‌వ్ గంగూలీలు అత్య‌ధిక మొత్తంలో ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేయించి భారీ మొత్తంలో ఫైన్లు క‌ట్టారు. పాంటింగ్ అప్ప‌ట్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉండ‌గా, గ్రేమ్ స్మిత్ సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా ప‌నిచేశాడు. అలాగే గంగూలీ భార‌త్‌కు అప్ప‌ట్లో కెప్టెన్‌గా ఉన్నాడు.

Advertisements

Advertisements