Advertisement
సిక్కిం : సిక్కిం … భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. అతి తక్కువ జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ఆహ్లాదకరం వాతావరణం, ప్రకృతి సోయగం వీక్షకులను ఆకట్టుకుంటాయి.
వెంకటేశ్వర స్వామి దేవాలయం , తిరుపతి :
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుపతి గొప్ప ఆద్యాత్మిక క్షేత్రం! ఏడు కొండలు, నల్లమల్ల అడవులు, పారుతున్న వాగులు…..ఖచ్చితంగా దర్శించాల్సిన ప్లేస్!
Advertisements
ముంబాయ్ :
ఇండియన్ బిజినెస్ క్యాపిటల్ ముంబాయి… గేట్ వే ఆఫ్ ఇండియా, ఆరేబియా సముద్రం…. పెద్ద పెద్ద కట్టడాలు, బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడ చూడదగ్గ ప్లేసులు.
గోల్డెన్ టెంపుల్, అమృతసర్ :
భారతదేశంలోని అమృతసర్ లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వారమే ఈ గోల్డెన్ టెంపుల్ ! దీనిని 16 వ శతాబ్దం లో నాలుగవ సిక్కు గురువు గురు రాందాస్ సాహిబ్ జీ నిర్మించారు.
అలెప్పి, కేరళ
కేరళలో పూర్తి స్థాయిలో ప్రణాళికా బద్ధంగా రూపొందించబడిన పట్టణం అలెప్పి….లార్డ్ కర్జన్ ఈ ప్రాంతాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడాడు. ఉప్పుటేరులు, బీచ్ లు , కాలువలు…. ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు.!
Advertisement
ఢిల్లీ :
దేశ రాజధాని,మొగలుల నాటి అనేక చారిత్రక కట్టడాలు ఇక్కడ చూడొచ్చు.! ఇక ఆధునిక కట్టడమైన అక్షరధామ్ ఓ వండర్ అనే చెప్పాలి! ఇండియాగేట్ , ఎర్రకోట, డిల్లీకి దగ్గర్లోని తాజ్ మహాల్, రాజ్ భవన్, పార్లమెంట్…. ఇలా ప్రతిదీ చూడదగ్గ ప్రదేశమే!
ఐజ్వాల్ , మిజోరం
విభిన్న వాతావరణం, విభిన్న సంస్కృతి, గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశం ఐజ్వాల్. మిజోరం రాజధాని అయిన ఐజ్వాల్ కు పెద్ద చరిత్రే ఉంది.! బరా బజార్ ,మిలేనియం సెంటర్ లు అక్కడి అతిపెద్ద ఓపెన్ మార్కెట్ లు., బెరాట్లాంగ్ టూరిస్ట్ కాంప్లెక్స్ , మిజోర్ స్టేట్ మ్యూజియం లు చూడదగ్గ ప్రదేశాలు
కుంబల్‌ఘర్, రాజస్థాన్:
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలవబడే గోడ కుంబల్ ఘర్ కోట చుట్టూ నిర్మించబడి ఉంది. ఆరావళి పర్వత శ్రేణుల్లోని ఈ కుంబల్‌ఘర్ కోటలో …. 300 వరకు అతి పురాతన హిందూ దేవాలయాలను కూడా నిర్మించారు, వాటి శిల్ప సౌందర్యం చూడాల్సిందే.!
Advertisements