Advertisement
గుప్తుల కాలంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం గురించి అందరికీ తెలిసిందే. దాన్ని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో.. సుమారుగా 1400 ఏళ్ల కిందట నిర్మించారు. గుప్తుల కాలంలో ఎంతో మంది విదేశీలయులు కూడా అక్కడ చదువుకునేందుకు వచ్చేవారు. ఎన్నో లక్షల తాళపత్రాలు అక్కడ ఉండేవి. ఆయుర్వేదం, శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన ఎన్నో పాఠ్యాంశాల పుస్తకాలు అక్కడ ఉండేవి. అప్పట్లో నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో పేరుగాంచింది. ఎంతో మంది పేరుగాంచిన రుషులు బోధన చేసేవారు. ఇప్పుడు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను అప్పట్లో అందులో బోధించేవారు. అయితే అంతటి గొప్ప విజ్ఞాన సంపదను కలిగి ఉన్న నలంద విశ్వవిద్యాలయం నాశనమైంది.
అప్పట్లో భక్తియార్ ఖిల్జీకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దీంతో అతనికి చాలా మంది అతని రాజ్యంలోని వైద్యులు చికిత్స చేశారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో నలంద విశ్వవిద్యాయ ప్రధానోపాధ్యాయుడు రాహుల్ శ్రీ భద్ర.. ఖిల్జీ అనారోగ్య సమస్యను నయం చేయగలడని అతని ఆస్థాన వైద్యులు చెప్పారు. అయినా ఖిల్జీ వినలేదు. రాను రాను సమస్య తీవ్రతరం కావడంతో ఇక ఖిల్జీకి శ్రీభద్ర సహాయం తీసుకోక తప్పలేదు. దీంతో ఖిల్జీ విజ్ఞప్తి మేరకు శ్రీభద్ర వచ్చి అతనికి వైద్యం చేసేందుకు ఉపక్రమించాడు.
అయితే ఖిల్జీ.. శ్రీభద్రకు ఒక షరతు పెట్టాడు. ఔషధాలను వాడకుండా తనకు చికిత్స చేయాలన్నాడు. దీంతో శ్రీభద్ర అలాగే అని చెప్పి ఖిల్జీ అనారోగ్య సమస్య ను దూరం చేస్తాడు. ఆశ్చర్యపోయిన ఖిల్జీకి మరోవైపు అసూయ కూడా కలుగుతుంది. తన ఆస్థానం, రాజ్యంలో ఎవరికీ లేని తెలివితేటలు నలంద విశ్వవిద్యాయంలోని ఆచార్యులకు ఉన్నాయని, అలాగే వారి తెలివి తేటలకు కారణమైన ఎన్నో పుస్తకాలు అందులో ఉన్నాయని, కనుక వాటిని తగలబెట్టాలని అతను ఆదేశిస్తాడు.
Advertisement
Advertisements
దీంతో ఖిల్జీ సైన్యం నలంద యూనివర్సిటీని ధ్వంసం చేస్తుంది. అక్కడి 3 గ్రంథాలయ భవనాలైన ది సీ ఆఫ్ జ్యువెల్స్, డిటైర్ ఆఫ్ జ్యువెల్స్, ది ఓషియన్ ఆఫ్ జ్యువెల్స్ ను ఖిల్జీ సైనికులు ధ్వంసం చేస్తారు. ఆ గ్రంథాలయాల్లో ఉన్న లక్షలాది పుస్తకాలకు నిప్పు పెడతారు. అయితే భారీ సంఖ్యలో పుస్తకాలు ఉన్నందున అవి పూర్తిగా కాలిపోయేందుకు సుమారుగా 6 నెలల వరకు సమయం పట్టింది. అప్పటి వరకు ఆ గ్రంథాలయ భవనాలు మండుతూనే ఉన్నాయి.
Advertisements
అలా ఖిల్జీ అసూయతో చేసిన పని వల్ల ఎంతో విలువైన విజ్ఞాన సంపద ఇప్పటి తరానికి అందకుండా నాశనమైంది. నిజానికి ఆ పుస్తకాల్లో ఎంతో విలువైన సమాచారం ఉంది. దాన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కొనలేం. అంతటి అమూల్యమైన సంపదను మనం పోగొట్టుకున్నాం. ఆ ఘటనలో సుమారుగా 90 లక్షలకు పైగా తాళపత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. అవే గనక ఇప్పుడు ఉండి ఉంటే మన దేశం ఎంతగా ప్రగతి సాధించేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే నలంద విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతం మొత్తం విస్తీర్ణం 1,50,000 చదరపు అడుగులు కాగా అక్కడ ఇంకా 90 శాతం ప్రాంతంలో తవ్వకాలు జరపాల్సి ఉంది. అది జరిగితే కొన్నయినా తాళపత్రాలు బయట పడేందుకు అవకాశం ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా నలంద విశ్వవిద్యాలయంలో అంతటి విలువైన విజ్ఞాన సంపదను కోల్పోవడం మన దేశానికి కలిగిన అతి పెద్ద నష్టంగా చెప్పవచ్చు.