Advertisement
శివాలయాల్లో భక్తులందరూ హర హర మహాదేవ అని శివున్ని ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా వారణాసిలో ఈ మంత్రం మనకు ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ ఏ వీధిలో చూసినా ఈ మంత్రాన్ని పఠించే వారు మనకు కనిపిస్తుంటారు. అయితే ఇంతకీ అసలు ఈ మంత్రానికి అర్థం ఏమిటి ? దీన్ని భక్తులు ఎందుకు పఠిస్తారు ? అంటే…
హిందూ పురాణాల ప్రకారం సృష్టి, స్థితి. లయ కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అయితే శివున్ని ఆరాధించే వారు (శైవులు) ఆ మూడింటికీ శివుడే కారకుడని నమ్ముతారు. శివున్నే వారు దేవుడిగా కొలుస్తారు. అందుకనే దేవుళ్లకే దేవుడిగా శివున్ని మహాదేవుడిగా వారు పిలుస్తారు. అందువల్లే ఆ మంత్రంలో మహాదేవ అని చేర్చారు.
Advertisement
ఇక హర అంటే తీసుకెళ్లేవాడని అర్థం వస్తుంది. అంటే మా కష్టాలను దూరంగా తీసుకెళ్లవయ్యా, శివయ్యా.. హర హర మహాదేవ అని అర్థం వస్తుంది. అలాగే హర ఇంకో అర్థం శివుడు. కనుక హర హర మహాదేవ అని అంటారు. ఇక హర అంటే మరో అర్థం మొత్తం అని అర్థం వస్తుంది. అంటే అన్నింటిలోనూ శివుడు ఉంటాడని అర్థం. కనుకనే హర హర మహాదేవ అని పఠిస్తారు.
అయితే భక్తులు మనస్ఫూర్తిగా శివున్ని పూజిస్తే చాలు వారు కోరిన కోర్కెలను ఆయన నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అడిగిన వెంటనే వరాలు ఇస్తాడు కనుక ఆయనకు బోళా శంకరుడు అని పేరువచ్చింది. మనుషులు, రాక్షసులు, దేవుళ్లు ఎవరైనా సరే.. భక్తితో ఒక్కసారి హర హర మహాదేవ అంటే.. వెంటనే ఆయన వారి కష్టాలను తీరుస్తాడని నమ్ముతారు. అందుకనే ఆ మంత్రాన్ని పఠిస్తారు.
Advertisements
Advertisements
సింపుల్ గా చెప్పాలంటే…….
- హర= పాపాలను
- హర =హరించేవాడు
- మహాదేవ= దేవుళ్లకే దేవ