Advertisement
రాష్ట్రానికి సీఎం అంటే మాటలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే.. దేశంలో ప్రధానికి ఎలా పాపులారిటీ ఉంటుందో.. రాష్ట్రంలో సీఎంకు అలా ప్రాముఖ్యత ఇస్తారు. గవర్నర్ తరువాత రాష్ట్రంలో సీఎం కే ప్రజలను పాలించే విషయంలో, ఇతర అంశాల పరంగా అధికారాలు ఉంటాయి. అయితే సీఎం రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటిస్తే.. ఆయనకు/ఆమెకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది ? ప్రోటోకాల్ ఎలా పాటిస్తారు ? ఇతర అంశాలు ఎలా ఉంటాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- సీఎం సందర్శించబోయే ప్రాంతం ఉన్న జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ముందుగానే కాపీ రూపంలో పంపుతారు.
- ఏదైనా ఫౌండేషన్ లేదా ఓపెనింగ్ కార్యక్రమం ఉంటే అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేస్తే దానిపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు ఉండాలి. అక్షర దోషాలు ఉండకూడదు.
- కార్యక్రమం జరిగే ప్రాంతానికి కొద్ది దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలి.
- సీఎం హెలికాప్టర్‌లో కార్యక్రమానికి వస్తుంటే.. హెలికాప్టర్ దిగే ప్రాంతాన్ని.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి వీలైనంత వరకు దగ్గరగా ఉండేలా చూడాలి.
- ఆయా ప్రాంతాలకు చెందిన అక్షాంశ, రేఖాంశాల వివరాలను అధికారులకు జీపీఎస్ ద్వారా ముందుగానే తెలియజేయాలి.
- హెలిప్యాడ్‌కు చుట్టు పక్కలా 10 మీటర్ల దూరం వరకు ఎలాంటి పొదలు, రాళ్లు రప్పలు ఉండకుండా ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. రహదారులైతే ట్రాఫిక్ ఉండకుండా చూడాలి.
- భద్రతా సిబ్బంది సీఎం వచ్చే మార్గంలో ఉండే బ్రిడ్జిలు, కల్వర్టులు, ఇతర అనుమానాస్పద ప్రదేశాల్లో ఉండి అవాంఛిత సంఘటనలు జరగకుండా నిఘా పెట్టాలి.
- రాష్ట్ర ఆర్ అండ్ బీ విభాగం హెలీప్యాడ్‌ను సిద్ధం చేయాలి.
- హెలికాప్టర్ దిగే సమయంలో, మళ్లీ ఎగిరే సమయంలో దుమ్ము లేవకుండా ఉండేందుకు గాను హెలీప్యాడ్‌ను నీటితో తేమగా చేయాలి.
- కార్యక్రమం జరిగే ప్రాంతానికి దగ్గర్లో వీవీఐపీ టెంట్‌ను ఏర్పాటు చేసి అందులో టెంపరరీ టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలి. వెస్టర్న్ పద్ధతిలో టాయిలెట్ ఉండేలా చూడాలి. అలాగే అక్కడికి వచ్చే అధికారులు, ఇతరుల కోసం మరొక టెంట్ ఏర్పాటు చేసి అందులోనూ టాయిలెట్ సౌకర్యం కల్పించాలి.
- హెలీప్యాడ్ వద్ద ఫైర్ సిబ్బంది ఉండాలి.
- కార్యక్రమం జరిగే ప్రాంతం వద్ద మెడికల్ ఆఫీసర్, ఇతర వైద్య సిబ్బంది ఉండాలి. వారు ఆంబులెన్స్, మొబైల్ ఆపరేషన్ థియేటర్, మెడిసిన్లు, కార్యక్రమానికి వచ్చే వారి బ్లడ్ గ్రూప్‌లకు చెందిన రక్తం, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
Advertisement
- భద్రతా సిబ్బంది పూల బొకేలను కచ్చితంగా చెక్ చేయాలి.
- ప్రతి కాన్వాయ్‌లో ఓ ఆంబులెన్స్ కచ్చితంగా ఉండాలి.
- కాన్వాయ్ ఒక రోజు ముందుగానే రిహార్సల్ చేయాలి.
- కార్యక్రమానికి వచ్చే వీవీఐపీలను రిసీవ్ చేసుకునేందుకు కచ్చితంగా ప్రొటోకాల్ టీం ఉండాలి.
- కాన్వాయ్‌లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎమర్జెన్సీ కోసం కచ్చితంగా ఉండాలి.
- వీవీఐపీలు జనాలకు అన్ని దిక్కుల నుంచి కనిపించే విధంగా స్టేజిని సిద్ధం చేయాలి.
- పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రేడియో ఇంజినీర్ మైక్, ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచాలి.
- మొబైల్ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఎమర్జెన్సీ కోసం స్టాండ్‌బైలో ఉంచాలి.
- విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అవసరం కోసం ముందుగానే జనరేటర్లను ఉంచాలి.
- ప్రోటోకాల్ ప్రకారమే గెస్టులను స్టేజిపైకి పిలవాలి.
- వేసవిలో స్టేజి మీద ఉన్నవారి కోసం ఫ్యాన్లు, ఏసీలను అమర్చాలి. వర్షాకాలం అయితే వర్షం కురిసినా లోపలికి నీరు రాకుండా టెంట్‌ను వాటర్‌ప్రూఫ్‌గా ఉండేదిగా అమర్చాలి.
Advertisements
Advertisements
- 4 రకాల పత్రికలను సిద్ధంగా ఉంచాలి.
- అవసరమైన అన్ని భద్రతా చర్యలను చేపట్టాలి.
- ఆహారం పరంగా అన్నింటినీ ముందుగానే సిద్ధం చేయాలి.
- కొత్తగా కొనుగోలు చేసిన సబ్బులు, టవల్స్, టిష్యూ పేపర్లను ఉంచాలి. నీటి సరఫరా, నల్లాలు సరిగ్గా పనిచేసేలా చూడాలి.