Advertisement
మనిషి బతికి ఉన్నంత కాలం ఆత్మ అతని శరీరంలో ఉంటుంది. మనిషి చనిపోయాక ఆత్మ అతని శరీరం నుంచి బయటకు వెళ్తుంది. తరువాత గత జన్మ స్మృతులు మరిచిపోతారు. అనంతరం ఆత్మ కొత్త శరీరాన్ని వెదుక్కుంటుంది. ఈ సిద్ధాంతాన్ని అనేక వర్గాలకు చెందిన వారు విశ్వసిస్తారు. అయితే ఆత్మను నిజానికి ఇప్పటి వరకు మనుషులు ఎవరూ చూడలేదు. కారణం ఆత్మ అనేది కంటికి కనబడదు. అయితే పలు గ్రంథాల్లో మాత్రం ఆత్మ పరిమాణం ఎంత ఉంటుంది ? అనే విషయాన్ని చెప్పారు.
క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో రచించినట్లు చెప్పబడే శ్వేతస్వతర ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదంలో ఆత్మ పరిమాణం గురించి ఒక శ్లోకం చెప్పబడింది. దాని ప్రకారం వెంట్రుక చివరి భాగం 100 భాగాలుగా విభజించబడుతుంది. ఆ 100 భాగాలు మళ్లీ 100 భాగాలుగా విభజించబడుతాయి. వాటిలో ఒక్కో భాగాన్ని ఆత్మగా పరిగణిస్తారు.
Advertisement
ఇక స్వామి ప్రభుపాద రాసిన చైతన్య చరితామృతలోనూ ఆత్మ పరిమాణం గురించి చెప్పారు. ఒక వెంట్రుక చివరి భాగం 10వేల భాగాలుగా విడిపోతుంది. అలాంటి ఒక్కో భాగాన్ని సిట్-కణగా వ్యవహరిస్తారు. అంటే ఆత్మగా పిలుస్తారని అర్థం. అంటే ఆత్మ సైజ్ అణువు కన్నా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది.
ఆత్మ బరువు 21 గ్రాములనేది డాక్టర్ కమ్ సైంటిస్ట్ మెక్ డగెల్ వాదన
Advertisements
చనిపోక ముందు మనిషి బరువుకు చనిపోయాక మనిషి బరువుకు మధ్య తేడా 21 గ్రాములని…అదే మనిషి ఆత్మ బరువు అని మెక్ డగెల్ వాదన. ఇదే ప్రయోగాన్ని 15 కుక్కలపై చేసి…కుక్కల మరణానికి ముందు మరణించిన తర్వాత అదే బరువు ఉన్నాయని…అంటే కుక్కలకు ఆత్మ ఉండదు మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుందని తెలిపాడు. అంతే కాకుండా జీవక్రియ ఆగడం వల్ల…1 నిమిషానికి మనిషి బరువు 0.5 గ్రాము మాత్రమే తగ్గుతుందని నిరూపించాడు. ఇది ధృవీకరించబడలేదు
Advertisements
భగవద్గీతలోనూ ఆత్మ సైజ్ గురించి ఇచ్చారు. ఆత్మకు నాశనం లేదని, దాన్ని మనిషి తన కళ్లతో చూడలేడని చెప్పారు. మండకోపనిషత్‌లో ఆత్మ శరీరంలో ఏయే భాగాల్లో ఉంటుందో చెప్పారు. అణువు సైజులో ఉండే ఆత్మ శరీరంలో 5 రకాల వాయువుల్లో ఉంటుందని, వాటిని ప్రాణ, అపాన, వ్యాన, సామన, ఉదాన వాయువులని పిలుస్తారని చెప్పారు. అలాగే ఆత్మ.. గుండె, కళ్లు, గొంతు భాగాల్లో అటు, ఇటు తిరుగుతుంటుందని చెప్పారు.