Advertisement
ఛత్రపతి శివాజీ తన హయాంలో ఎన్ని ఘన విజయాలు సాధించాడో అందరికీ తెలిసిందే. ఎంతో మంది రాజులను ఓడించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మొగల్ చక్రవర్తులకు చుక్కలు చూపించాడు. అయితే శివాజీ వద్ద బల్లి జాతికి చెందిన ఓ జీవి (ఉడుము) ఉండేదని చెబుతారు. దాని సహాయంతో ఆయన ఓ యుద్ధంలో గెలిచాడని కూడా అంటుంటారు. ఇంతకీ అసలు ఏంటా కథ..? ఆ జీవి ఏమిటి..? అంటే…
క్రీస్తు శకం 1670వ సంవత్సరంలో పూణె సమీపంలోని సింహగఢ్ వద్ద జరిగిన యుద్ధంలో ఛత్రపతి శివాజీ వద్ద ఉన్న సైన్యాధిపతి తానాజీ మలుసరె వీరోచిత పోరాటం చేశాడు. సింహగఢ్ వద్ద కోటను ఎక్కేందుకు గాను తానాజీ ఆ సమయంలో శివాజీ వద్ద ఉన్న ఓ బెంగాల్ మానిటర్ లిజర్డ్ (బల్లి జాతి) సహాయం తీసుకున్నాడు. దానికి తాళ్లను కట్టి రెండు సార్లు కోటపైకి పాకించి యత్నించాడు. కానీ రెండు సార్లు విఫలమయ్యాడు. ఇక చివరిగా మూడో యత్నంలో ఆ బల్లి కోటపైకి ఎక్కింది. దీంతో దాంతోపాటే తానాజీ, ఇతర సైనికులు ఎక్కి కోటను చుట్టు ముట్టారు. అనంతరం భీకర యుద్ధం జరిగింది. అందులో మొగలులను తానాజీ ఓడించాడు. కోటను స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఆ యుద్ధంలో తానాజీ వీరమరణం పొందాడు.
Advertisement
Advertisements
కాగా ఆ యుద్ధంలో తానాజీ చనిపోయినప్పటికీ సింహగఢ్ కోట మాత్రం శివాజీ సామ్రాజ్యం వశమైంది. అయితే తానాజీ మరణం పట్ల శివాజీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. అంతటి గొప్ప వీరున్న కోల్పోయినందుకు శివాజీ బాధపడ్డాడు. ఈ క్రమంలోనే శివాజీ తానాజీని ఉద్దేశించి వ్యాఖ్యలు కూడా చేశాడు. కోటను స్వాధీనం చేసుకున్నాం, కానీ సింహాన్ని కోల్పోయాం.. అన్నాడు.
Advertisements
అయితే ఆ యుద్ధంలో తానాజీ ఉపయోగించిన ఆ బల్లిని శివాజీ యశ్వంతి అని పిలిచేవాడట. దాంతోనే ఆ యుద్దంలో తానాజీ గెలిచాడని చెబుతారు. ఈ క్రమంలోనే శివాజీ ఆ కోటకు తానాజీ జ్ఞాపకార్థం పేరు పెట్టాడు.