Advertisement
ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ వైఫై కాలింగ్ అంటే ఏంటీ అనేది చాలా మందికి క్లారిటీ లేదు. కాని ఫ్రీ వైఫై కాలింగ్ అనే దాన్ని మార్కెటింగ్ చేస్తూ దాని ఉపయోగాలు దాచేస్తూ వ్యాపారం జరుగుతుంది. అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…? అది ఏ విధంగా పని చేస్తుందో ఒకసారి చూద్దాం.
Also Read:కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?
మన మొబైల్ ఫోన్లు నుండి ఎవరితో కాల్ చేయాలి అంటే అది మన సిం కార్డ్ సిగ్నల్ బట్టి సాధ్యమవుతుంది. అయితే ఈ వైఫై కాలింగ్ తో, మన సింకార్డ్ సిగ్నల్ తో సంబందం లేకుండానే కేవలం వైఫై సిగ్నల్ ద్వారా కాల్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్, వైఫై రూటర్ ఉంటే దాని మన మొబైల్ కి వైఫై కనెక్ట్ చేసుకుంటే ఈ సర్వీస్ మీకు అందుబాటులోకి వస్తుంది.
Advertisement
Advertisements
మన మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో ” వైఫై కాలింగ్” కి అగ్రీ చేయాల్సి ఉంటుంది. వైఫై సిగ్నల్ ఆధారం గా కాల్స్ రావడం వెళ్ళడం సాధ్యం. ఎవరి ఇంట్లో అయినా…, సిం కార్డ్ సిగ్నల్ సరిగా లేకపోతే మాత్రం ఈ వైఫై కాలింగ్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. టెలికాం కంపెనీలు దీని గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం లేదు అనే ఆరోపణ ఉంది.
Advertisements
Also Read:అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?