Advertisement
సౌదీ అరేబియాలోని మక్కాలో ఉ్న మస్‌జిద్ అల్-హరాంలో ఓ బావి ఉంది. దాని నుంచి వచ్చే నీళ్లనే జమ్‌జమ్ వాటర్ అంటారు. వీటిని ముస్లింలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. కాబాకు సరిగ్గా 21 మీటర్లు తూర్పు వైపున ఈ బావి ఉంటుంది. దాన్ని చిత్రంలో చూడవచ్చు. అయితే ఈ బావిని వేల ఏళ్ల కిందటే కనుగొన్నారు.
అప్పట్లో ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్ తన తల్లి హజార్‌తో కలిసి ఎడారిలో ప్రయాణిస్తుండగా.. వారికి విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో వారు నీటి కోసం ఓ దశలో దుఃఖిస్తారు. ఆ కోవలోనే వారు భూమిలోకి తవ్వుతూ వెళ్తారు. చివరకు స్వచ్ఛమైన నీటి ఊట పైకి చిమ్ముతుంది. దాంతో ఆ నీటిని తాగి వారు దాహం తీర్చుకుంటారు. ఇక అప్పటి నుంచి ఆ బావి ద్వారా నీరు బయటకు వస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది ముస్లింలు హజ్ లేదా ఉమ్రా యాత్రకు వస్తే ఆ నీటిని తప్పక తాగుతారు.
Advertisements
Advertisement
అయితే చాలా వేల ఏళ్ల సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆ బావి నుంచి ఇంకా నీరు వస్తూనే ఉంది. కానీ ఎండిపోలేదు. మస్‌జిద్ అల్-హరాంను విస్తరించినప్పుడు తాత్కాలికంగా పెద్ద పంపులను పెట్టి నీటిని తోడేశారు. అయినప్పటికీ తరువాత నీరు మళ్లీ భారీగా ఊట వచ్చింది. ఇక మక్కాలో ఉన్న రెండు మసీదుల్లో ఆ బావి నిర్మాణానికి సంబంధించిన ప్రదర్శనను కూడా మనం చూడవచ్చు.
కాగా ప్రస్తుతం ఆ బావిని అక్కడి ఇంధన మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. అలాగే దాన్ని చారిత్రక వారసత్వ సంపదగా కూడా గుర్తించారు. దీంతో దానికి ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తూ బావిని రక్షిస్తూ వస్తున్నారు. మక్కాకు వచ్చే అతిథులకు అక్కడి ప్రజలు జమ్‌జమ్ వాటర్ ఇచ్చి ఆతిథ్యం ఇస్తారు. రంజాన్ నెలలో అక్కడి ప్రజలు ఉపవాసం విడిచాక జమ్‌జమ్ వాటర్ తాగడంతోపాటు కేవలం ఖర్జూరాలను మాత్రమే తింటారు.
Advertisements
మక్కాకు వచ్చే భక్తులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాటర్ కంటెయినర్ల వద్ద ప్లాస్టిక్ కప్పుల్లో జమ్‌జమ్ వాటర్‌ను పట్టుకుని తాగుతారు. చల్లని జమ్ జమ్ వాటర్ కూడా భక్తులకు లభిస్తుంది. మస్‌జిద్ అల్-హరాంతోపాటు మస్‌జిద్ అన్ నబావిలోనూ జమ్‌జమ్ వాటర్ కంటెయినర్లను ఏర్పాటు చేశారు. ఇక జమ్‌జమ్ వాటర్‌ను భక్తులు 5 లీటర్ల క్యాన్లలోనూ తీసుకెళ్లవచ్చు. ఇతర దేశాల వారు ఈ నీటిని తమ దేశాలకు తీసుకెళ్లేందుకు కూడా అనుమతిస్తారు.