Advertisement
శివలింగం అంటే నిజానికి చాలా మంది.. ఓ ప్రత్యుత్పత్తి అవయం (లింగం) అని అనుకుంటారు. కింది భాగంలో ఉండే పానపట్టాన్ని యోని అనుకుంటారు. అయితే అది నిజమే అయినప్పటికీ.. శివలింగం అంటే.. అందుకు పురాణాలే కాదు.. సైన్స్ కూడా పలు అర్థాలను చెబుతున్నాయి. శివలింగంలో.. లింగం అంటే.. సంస్కృతంలో చిహ్నం అని కూడా అర్థం వస్తుంది. అంటే.. అంతులేని సర్వశక్తికి ఆ లింగం చిహ్నమన్నమాట.
ఇక శివలింగంలో మొత్తం 3 భాగాలుంటాయి. కింది భాగాన్ని బ్రహ్మ పీఠమని, మధ్యలో భాగాన్ని విష్ణు పీఠమని, పైన ఉన్న భాగాన్ని శివ పీఠమని అంటారు. అంటే సృష్టి, స్థితి, లయ కారకులకు శివలింగం ఒక చిన్నమన్నమాట. సృష్టి జరిగాక స్థితి ఉంటుంది. అనంతరం శివునిలో లయం అవుతుంది. తిరిగి మళ్లీ అదే ప్రక్రియ మొదలవుతుందనే విషయాన్ని శివలింగం మనకు తెలియజేస్తుంది.
Advertisement
కాగా లింగ పురాణం చెబుతున్న ప్రకారం.. శివలింగం వాసన లేనిది. రుచి ఉండనిది. రంగు లేనిది. దీన్నే ప్రకృతిగా పిలుస్తారు.
Advertisements
Advertisements
సైన్స్ చెబుతున్న ప్రకారం శివలింగం గణితంలో ఉండే ఒక సైన్ వేవ్ లాంటిది. అందులోని తరంగాలు ఓంకారాన్ని సూచిస్తాయి. శివుడు ఈ తరంగాలకు ముందు అనుపూర్వ స్థితిలో ఉంటాడు. విష్ణువు తరంగాల నిండా అణువుల్లా వ్యాపించి ఉంటాడు. శివుడు ఓంకార నాదం ద్వారా సృష్టి చేస్తాడు. విష్ణువు స్థితి చూసుకుంటాడు. తరువాత సృష్టి అంతమై మళ్లీ ప్రారంభమవుతుంది. ఇలా సృష్టిలో శివుడు, విష్ణువు ఉంటారు.