Advertisement
డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా చేసుకుంటారు. లేని వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. డబ్బులున్నా సరే కొన్ని కారణాలతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటానికి చేయవలసిన,పాటించవలసిన నియమాలు ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. అసలు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 21 ఏళ్లు అమ్మాయికి అబ్బాయికి దాటి ఉండాలి.
Also Read:సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!
21 ఏళ్ళు దాటిన వాళ్ళు… తామిద్దరూ వివాహం చేసుకోవడానికి అవసరమైన వయస్సు నిండిన వారమని పేర్కొంటూ రిజిస్టర్ ఆఫీసులో అన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఇద్దరి ఫోటోలు ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు నోటీస్ బోర్డ్ లో పెట్టి… వీరిద్దరి వివాహం పై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయమని కోరుతూ ఉంటారు.
Advertisement
Advertisements
నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత తమ ఆమోదం చెప్తారు. అనంతరం వీరిద్దరూ వెళ్లి వివాహం చేసుకొని రిజిస్ట్రార్ కార్యాలయం వివాహ రిజిస్ట్రేషన్ రికార్డు లో సంతకాలు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువు తర్వాత వారికి వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో ఇప్పుడు ఆన్ లైన్ లో చేసుకునే సదుపాయం కూడా కేంద్ర ప్రభుత్వాలు కల్పించాయి. సినిమాల్లో చూపించినట్టు వెళ్ళగానే పెళ్లి చేయరు.
Advertisements
Also Read:సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?