Advertisement
ఒక రోజు ఎక్కువగా మన చేతిలో ఉండాలంటే కచ్చితంగా ఉదయం చాలా త్వరగా నిద్ర లేవాలి. కనీసం 5 గంటలకు నిద్ర లేచి గంట సేపు మనం ఆర్చుకుని తీర్చుకుని ఏదోక పని చేసినా… ఆ తర్వాత మనకు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎక్కువ సమయం దొరుకుతుంది. చాలా మందికి ఉదయం లేవడం కష్టంగా ఉంటుంది.
Read Also:ఇది కదా క్రికెట్ అంటే: రన్ అవుట్ చేసే ఛాన్స్ వచ్చినా కావాలని వదిలేసిన కీపర్
అతి ముఖ్యమైన అలవాటు ఏంటి అంటే… రాత్రి త్వరగా పడుకోవడం (తొమ్మిది- పది గంటల మధ్యలో) ముఖ్యం. చాలా మందికి రాత్రి త్వరగా పడుకున్నా నిద్ర వచ్చే అవకాశం ఉండదు. పడుకున్న వెంటనే నిద్ర రావాలి అనుకుంటే… సాయంత్రం సమయంలో వ్యాయామం వంటివి చేయాలి. పడుకునే ముందు మన శరీరం అలసిపోతే కచ్చితంగా నిద్ర వస్తుంది. నిద్రకు ముందు సెల్ ఫోన్, టీవిలను ఆఫ్ చేస్తే బెస్ట్.
Advertisement
Advertisements
పిల్లలు ఉంటే వాళ్లకు కథలు చెప్పండి. అలా కథలు చెప్పే టైం లో మనసు ప్రశాంతంగా ఉంటుంది కచ్చితంగా నిద్ర వస్తుంది. పడక గదిలో అనవసరమైన శబ్దాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఇక ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటే అది మనకు కనీసం 10 అడుగుల దూరంలో ఉండాలి. రిపీట్ అలారం పెట్టుకోవడం చాలా మంచిది. మోగుతూ ఉంటే విరక్తి వస్తుంది. ఇక అలా ఒక్క పది రోజులు అలవాటు చేసుకుంటే కచ్చితంగా లేచే అవకాశం ఉంటుంది.
Advertisements