• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

ప‌ద్మ‌వ్యూహంలోకి అభిమ‌న్యుడికి బ‌దులుగా అర్జునుడు వెళ్లి ఉంటే ఏం జ‌రిగేది? మ‌్యాచ్ T-20 కంటే ఫాస్ట్ గా పినిష్ అయ్యేదా?

August 9, 2020 by Admin

Advertisement

ప‌ద్మ‌వ్యూహంలోకి…..అభిమ‌న్యుడి ప్లేస్ లో అర్జునుడి వెళ్లిఉంటే….? కౌరవుల సైన్యం మొత్తం దాదాపుగా ఆ రోజే తుడిచి పెట్టుకుపోయి ఉండేది. దీంతో యుద్ధం కూడా ఆ రోజే ముగిసి ఉండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అభిమ‌న్యుడి మ‌ర‌ణం సంభ‌వించాల‌ని రాసి పెట్టి ఉంది. దాని వ‌ల్ల పాండ‌వులు మ‌రింత భీక‌రంగా యుద్ధం చేయాల‌ని నిర్దేశించ‌బ‌డింది. అందువ‌ల్లే ఆ సంఘ‌ట‌న జ‌రిగింది. లేదంటే అర్జునుడి ముందు ఆరోజు కౌర‌వులు నిల‌బ‌డ‌లేక‌పోయేవారు..!

అభిమ‌న్యుడి క‌థేంటి? కృష్ణుడు అభిమ‌న్యుడిని ఎందుకు కాపాడ‌లేదు?:

మ‌హాభార‌తంలో అభిమ‌న్యుడి గురించి తెలియ‌ని వారుండ‌రు. అర్జునుడు, సుభద్రల కుమారుడే అభిమ‌న్యుడు. సుభద్ర శ్రీ‌కృష్ణుడికి చెల్లెలు. అందువ‌ల్ల అభిమ‌న్యుడు శ్రీ‌కృష్ణుడికి స్వ‌యానా మేన‌ల్లుడు. ఇక అభిమ‌న్యుడు త‌ల్లి గ‌ర్భంలో ఉండ‌గానే ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకుంటాడు. కృష్ణుడు ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా ఛేదించాలో అర్జునుడికి వివ‌రిస్తుంటాడు. ఆ స‌మ‌యంలో సుభద్ర గ‌ర్భంతో ఉంటుంది. ఆమె గ‌ర్భంలో ఉండే అభిమ‌న్యుడు ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకుంటాడు. కానీ శ్రీ‌కృష్ణుడు మాత్రం స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చెప్పి కావాల‌నే అర్జునున్ని మ‌రొక గ‌దిలోకి తీసుకెళ్తాడు. దీంతో అభిమ‌న్యుడికి ప‌ద్మ‌వ్యూహాన్ని ఛేదించ‌డం వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు. అందులో నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాలో తెలియ‌దు.

 

మ‌హాభార‌త యుద్ధంలో 13వ రోజు ద్రోణాచార్యుడు కొంత‌మంది కౌర‌వ సేన‌ల‌ను ద్వార‌క వైపు మ‌ళ్లిస్తాడు. దీంతో కృష్ణుడు, అర్జునుడు ఇద్ద‌రూ వారిని ఎదుర్కొనేందుకు ద్వార‌క వైపుకు వెళ్తారు. ఇక మిగిలిన న‌లుగురు పాండ‌వుల‌ను జ‌య‌ద్ర‌తుడు క‌ట్ట‌డి చేస్తాడు. జ‌య‌ద్ర‌తుడు కౌర‌వుల ఏకైక సోద‌రి ద‌స్సుల‌ను వివాహం చేసుకుంటాడు. అందువ‌ల్ల అత‌ను కౌర‌వుల వైపు యుద్ధంలో పాల్గొంటాడు. అలాగే అత‌నికి పాండ‌వుల‌తో పాత క‌క్ష‌లు ఉంటాయి. ఈ క్ర‌మంలో జ‌య‌ద్ర‌తుడు కేవ‌లం అర్జునుడు, కృష్ణుడి చేతుల్లో త‌ప్ప ఇత‌రులెవ‌రూ త‌న‌ను చంప‌కూడ‌ద‌ని శివుడి నుంచి వ‌రం పొందుతాడు. అలాగే అర్జునుడు కాకుండా మిగిలిన న‌లుగురు పాండ‌వుల‌ను ఒక్క రోజంతా బంధించి ఉంచే వ‌రాన్ని కూడా జ‌య‌ద్ర‌తుడు శివుడి నుంచి పొందుతాడు. దీంతో జ‌య‌ద్ర‌తుడు ఆ న‌లుగురు పాండ‌వుల‌ను ఒక్క రోజంతా బంధిస్తాడు.

Advertisements

Advertisement

 

మ‌రోవైపు ద్వార‌కలో కృష్ణుడు, అర్జునుడు కౌర‌వ సేవ‌ల‌ను ఎదుర్కొంటుంటారు. అయితే అదే అదునుగా భావించిన ద్రోణాచార్యుడు పాండ‌వ సైన్యాన్ని అంతం చేయ‌డం కోసం ప‌ద్మ‌వ్యూహం ప‌న్నుతాడు. దాన్ని ప‌సిగ‌ట్టిన అభిమ‌న్యుడు ముందు వెనుక ఆలోచించ‌కుండా ఆ వ్యూహంలోకి ప్ర‌వేశించి దాన్ని ఛేదిస్తాడు. కానీ బ‌య‌ట‌కు ఎలా రావాలో అత‌నికి తెలియ‌దు. దీంతో చివ‌ర‌కు అభిమ‌న్యుడు క‌ర్ణుని చేతిలో హ‌త‌మ‌వుతాడు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న అర్జునుడు ప్ర‌తీకార జ్వాల‌తో రగిలిపోయి అభిమ‌న్యుడి మృతికి కార‌ణ‌మైన జ‌య‌ద్ర‌తుడిపై పాశుప‌తాస్త్రం వేసి సంహ‌రిస్తాడు. ఈ క్ర‌మంలో అభిమ‌న్యుడి మ‌ర‌ణం పాండవులంద‌రినీ క‌ల‌చి వేస్తుంది. దీంతో వారు మరింత కోపోద్రిక్తులై యుద్ధం చేసి కౌరవుల‌పై విజ‌యం సాధిస్తారు.

Advertisements

అయితే నిజానికి కృష్ణుడు కావాలంటే అభిమ‌న్యున్ని ర‌క్షించి ఉండేవాడే. కానీ అందుకు ఓ కార‌ణం ఉంది. అదేమిటంటే.. అభిమ‌న్యుడు చంద్రుని కుమారుడు. చంద్రుడు ముందుగానే కృష్ణుడి నుంచి వ‌రం తీసుకుంటాడు. త‌న కుమారుడు వ‌ర్చుడు అభిమ‌న్యుడిగా జ‌న్మిస్తాడ‌ని.. అత‌ను భూమిపై కేవ‌లం 16 ఏళ్లు మాత్రమే జీవిస్తాడ‌ని, త‌రువాత ఒక్క రోజు కూడా త‌ను అక్క‌డ ఉండ‌డానికి వీలు లేద‌ని, వెంట‌నే త‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌ని చంద్రుడు కోరుతాడు. అందుకు కృష్ణుడు అంగీక‌రిస్తాడు. అందువ‌ల్లే కృష్ణుడు అర్జునుడికి ప‌ద్మ‌వ్యూహం ఛేదించే విష‌యాన్ని స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చెబుతాడు. మిగిలిన స‌గాన్ని మ‌రొక గ‌దిలోకి తీసుకువెళ్లి వివ‌రిస్తాడు. దీంతో అభిమ‌న్యుడికి ఆ వ్యూహంలోకి వెళ్ల‌డ‌మే తెలుస్తుంది. బ‌య‌ట‌కు రావ‌డం తెలియ‌దు. ఫ‌లితంగా అత‌ను చ‌నిపోయి.. త‌న తండ్రి చంద్రున్ని చేరుకుంటాడు. అదంతా ముందే నిర్ణ‌యించ‌బ‌డింది.. క‌నుక‌నే కృష్ణుడు అభిమ‌న్యున్ని కాపాడ‌లేదు.

ఇక ఒక ర‌కంగా చెప్పాలంటే అభిమ‌న్యుడి మ‌ర‌ణం అటు అర్జునుడినే కాదు.. పాండవులంద‌రినీ తీవ్రంగా క‌ల‌చివేస్తుంది. దీంతో అప్ప‌టి వ‌రకు వారు కొంచెం అటు ఇటుగా యుద్ధం చేసేవారు కాస్తా.. తీవ్ర‌మైన ఆగ్ర‌హావేశాల‌కు లోనై భీక‌ర యుద్ధానికి దిగుతారు. అర్జునుడు అంత‌కు ముందు యుద్ధం చేయాలంటేనే సంశ‌యించేవాడు.. కానీ అభిమ‌న్యుడి మ‌ర‌ణంతో అత‌నిలో యుద్ధ కాంక్ష మ‌రింత పెరుగుతుంది. దీంతో అత‌ను యుద్ధ రంగంలోకి ఏమాత్రం సంశ‌యించ‌కుండా ముంద‌డుగు వేస్తాడు. కౌర‌వులను నిర్దాక్షిణ్యంగా హ‌త‌మారుస్తాడు. ఆ యుద్ధ కాంక్ష‌ను పెంచేందుకు అభిమ‌న్యుడి మ‌ర‌ణం కార‌ణ‌మ‌వుతుంది. అస‌లు స‌గం దానివ‌ల్లే పాండవులు మ‌రింత భీక‌రంగా యుద్ధం చేసి త్వ‌ర‌గా కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించార‌ని చెప్ప‌వ‌చ్చు.

Filed Under: Mythology, News

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj