Advertisement
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తన యూజర్లకు అందిస్తూనే వస్తోంది. అందులో భాగంగానే త్వరలో మరొక అద్భుతమైన ఫీచర్‌ను ఆ యాప్ అందుబాటులోకి తేనుంది. డిజప్పియరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లో యూజర్లు పంపుకునే మెసేజ్‌లు 7 రోజుల తరువాత వాటంతట అవే మాయమైపోతాయన్నమాట.
వాట్సాప్‌లో రానున్న డిజప్పియరింగ్ మెసేజెస్ డిఫాల్ట్‌గా డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటేనే ఆ ఫీచర్‌ను వాడుకోగలం. ఇక వ్యక్తిగత చాట్‌లలో యూజర్ల తమ ఇష్టానికి అనుగుణంగా ఈ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. కానీ గ్రూప్ చాట్‌లలో డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసే అధికారం కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే ఉంటుంది.
Advertisement
డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే మెసేజ్ లు 7 రోజుల పాటు అలాగే ఉంటాయి. తరువాత అవి వాట్సాప్ నుంచి మాయమైపోతాయి. వాటిని బ్యాకప్ తీసుకుని మళ్లీ రీస్టోర్ చేసినా అవి ఉండవు. డిలీట్ అయి కనిపిస్తాయి. అలాగే 7 రోజుల పాటు మెసేజ్‌లను ఓపెన్ చేయకపోయినా సరే ఆ ఫీచర్ ఆన్‌లో ఉంటే గనక 7 రోజుల తరువాత ఆ మెసేజ్ లు డిలీట్ అవుతాయి. అయితే నోటిఫికేషన్ ప్యానెల్‌లో మెసేజ్‌లను క్లియర్ చేయకపోతే అవి ఎన్ని రోజులైనా అక్కడ మనకు అలాగే కనిపిస్తాయి.
ఇక మెసేజ్‌లకు రిప్లై ఇస్తే ఆ మెసేజ్‌లు కొటేషన్స్‌తో దర్శనమిస్తాయి. 7 రోజుల తరువాత ఆ మెసేజ్ లు డిలీట్ అయినా కొటేషన్స్ మాత్రం అలాగే ఉంటాయి. అయితే డిజప్పియరింగ్ ఇమేజ్ లు, వీడియోలను సేవ్ చేసుకునేందుకు మాత్రం ఆప్షన్ ఇస్తారు. దాంతో ఆయా ఫొటోలు, వీడియోలను ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
Advertisements
Advertisements