Advertisement
మొదట సోషల్ మీడియాలో హాయ్ అంటుంది, మాటలు కలుపుతుంది., చనువు పెంచుకుంటుంది. నెంబర్ తీసుకుంటుంది. కట్ చేస్తే వాట్సాప్ కు వీడియో కాల్ చేస్తుంది. బట్టలు లేకుండా కనిపిస్తుంది…. అవతలి వ్యక్తిని టెంప్ట్ చేస్తుంది. నిన్నూ ఇలా చూడాలని ఉందని కవ్విస్తుంది…..అవతలి వ్యక్తి బట్టలు లేకుండా చేసిన వీడియో కాల్ ను రికార్డ్ చేసుకుంటుంది. ఇక్కడి నుండి వ్యాపారం స్టార్ట్ చేస్తుంది!
Advertisement
ఈ టైప్ ఆఫ్ ఘరానా మోసం ముంబాయ్ లో వెలుగు చూసింది. ప్రగ్యా జైన్ గా పరిచయం అయిన ఓ అమ్మాయి ముంబైలో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్న 21 ఏళ్ల అరుణ్ తో సోషల్ మీడియాలో పరిచయమై…..తన ప్లాన్ ప్రకారం అతని నగ్న వీడియోను సంపాదించింది. అర్జెంట్ గా 20 వేలు అకౌంట్లో వేయి…లేకుండా ఈ వీడియోను నీ బంధువులకు పంపుతానని బెదిరించింది. ….ఊహించని ఘటనకు షాక్ అయిన అరుణ్ 2 వేలు అకౌంట్ లో వేశాడు….ఇంతకు మించి డబ్బులు లేవని చెప్పాడు.! అతని వీడియోను అతని ఫ్రెండ్ కు సెండ్ చేసి….ఆ స్క్రీన్ షాట్స్ ఇతనికి సెండ్ చేసింది….దీంతో భయపడిన అరుణ్ తన ఫ్రెండ్స్ దగ్గర అప్పుచేసి మరీ 18 వేలు ఆమె అకౌంట్ కు ట్రాన్ఫర్ చేశాడు.
Advertisements
కొన్ని రోజుల గ్యాప్ తర్వాత….మళ్లీ ఆమె అరుణ్ కు కాల్ చేసి… మరిన్ని డబ్బులు డిమాండ్ చేసింది..ఇక ఈ సారి చేసేదేం లేక అరుణ్ పోలీసులను ఆశ్రయించడంతో…. ప్రగ్యా పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు! ఇలా ఆమె ఇంకెంత మందిని మోసం చేసింది? అనే కోణంలో పోలీసులు దర్వాప్తు చేపట్టారు.! ఈమె లిస్ట్ లో బడాబాబుల కొడుకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది!
Advertisements