Advertisement
లాక్ డౌన్ తో మనుషులందరూ ఇళ్లల్లో ఉంటే..పక్షులు,జంతువులు మాత్రం స్వేచ్చగా విహరిస్తున్నాయి..వాటికి సంబంధించిన అనేక ఫన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. ఈ వీడియోల సంగతి కాసేపు పక్కన పెడితే, హీరోహీరోయిన్లతో పాటు జంతువులు ప్రధానపాత్రలుగా వచ్చిన సినిమాలు ఉన్నాయి..తెలుగులో వచ్చిన అటువంటి సినిమాలు కొన్ని మీకోసం..
రాజేంద్రుడు గజేంద్రుడు
జంతువులు ప్రధానపాత్రగా తెరకెక్కిన సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది రాజేంద్రుడు గజేంద్రుడు..1993లో రాజేంద్రప్రసాద్,సౌందర్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఏనుగు లీడ్ రోల్ లో కనిపిస్తుంది.. తన యజమాని చనిపోయిన బాధలో ఎక్కడో అడవి నుండి సిటికి చేరుకున్న ఏనుగు కథ ఇప్పటికి చిన్నపిల్లలకి పెద్దవాళ్లకి నచ్చే సినిమాల్లో ఒకటి.
సాహసవీరుడు సాగరకన్య
Advertisements
వెంకటేశ్, మాలాశ్రీ, శిల్పాశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సాహసవీరుడు సాగరకన్య.. ఈ సినిమాలో శిల్పాశెట్టి సాగరకన్యగా నటించింది.. నిజంగా సాగరకన్యలు ఉంటే ఇలాగే ఉంటారా అనిపించేలా నటించింది.
ఈగ
రాజమౌలి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ఈగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. ఈ సినిమాలో నాని చనిపోయి తన ఆత్మ ఈగలోకి ప్రవేశిస్తుంది..అక్కడ నుండి కథ మొదలవుతుంది..ఒక హీరోతో చేయించే సాహాసాలన్ని ఈ సినిమాలో ఈగతో కూడా చేయించేశారు రాజమౌలి.
Advertisement
మృగరాజు
చిరంజీవి,సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా మృగరాజు.. ఈ సినిమాలో అడవికి రారాజు సింహం ది లీడ్ రోల్..
అదుగో
విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు.. ఏకంగా పందితో ఒక సినిమాను తెరకెక్కించారు..పంది పాత్ర ప్రధానంగా వచ్చిన ఈ సినిమా పేరు “అదుగో”.
గోదావరి
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన సినిమా గోదావరిలో కమలిని ముఖర్జి , సుమంత్ నటించారు..శేఖర్ తన సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు ..ఈ సినిమాలో ఒక కుక్క పిల్ల చిన్నపిల్లాడికి సాయం చేస్తూ ఉంటుంది..కుక్కపిల్లకి శేఖర్ కమ్ములే డబ్బింగ్ చెప్పారు.
సాహసబాలుడు విచిత్రకోతి
చిన్నపిల్లలకు బాగా నచ్చే సినిమా సాహసబాలుడు విచిత్రకోతి..ఈ సినిమాలో చింపాంజి మరియు చిన్నపిల్లాడు చేసే అల్లరి చూడొచ్చు.
Advertisements