Advertisement
అధిక బరువు తగ్గాలనుకునే ఎవరైనా సరే నిత్యం వ్యాయామం చేస్తుంటారు. దాంతోపాటు టైముకు అన్ని పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని తీసుకుంటుంటారు. టైముకు నిద్రపోతుంటారు. అయితే బరువు తగ్గే విషయం బాగానే ఉంటుంది, కానీ బరువు తగ్గే క్రమంలో మన శరీరంలో ఉండే కొవ్వు ఎక్కడికి వెళ్తుందో తెలుసా..? మన శరీరంలో మొండిగా ఉండే కొవ్వు ఎలా బయటకు వెళ్తుంది ? మనం ఎలా బరువు తగ్గుతాం ? అంటే.
అధిక బరువు తగ్గేందుకు సహజంగానే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు తక్కువ క్యాలరీలు కలిగిన ఫుడ్‌ను తీసుకుంటారు. దీంతో శరీరానికి నిత్యం కావల్సిన దాని కన్నా తక్కువ సంఖ్యలో క్యాలరీలు అందుతాయి. ఫలితంగా శరీరం తనకు ఇంకా కావల్సిన క్యాలరీల కోసం శరీరంలోని కొవ్వుపై ఆధార పడుతుంది. ఈ క్రమంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గేవారు పాటించే డైట్, చేసే వ్యాయామం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.
Advertisement
అయితే శరీరంలోని కొవ్వు మనం ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. అలాగే కొద్ది భాగం మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇంకొంత భాగం కార్బన్ డయాక్సైడ్ రూపంలో బయటకు వెళ్తుంది. ఉదాహరణకు చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను, పిండి పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి కదా. దీన్నే కిరణ జన్య సంయోగ క్రియ అంటారు. అయితే మన శరీరం ఇందుకు రివర్స్‌లో పనిచేస్తుంది. అంటే మనం ఆక్సిజన్ తీసుకుని పిండి పదార్థాలు, కొవ్వులను కరిగిస్తాం. దీంతో కార్బన్ డయాక్సైడ్, నీరు విడుదలవుతాయి. ఆ నీరు చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది. ఇక కార్బన్ డయాక్సైడ్ మన శ్వాస ప్రక్రియ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇలా మన శరీరం కొవ్వును కరిగిస్తుంది. అయితే అలా మన శరీరం చేయాలంటే నిత్యం మన శరీరానికి కావల్సిన దాని కన్నా తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి.
Advertisements
Advertisements
నిత్యం కూర్చుని పనిచేసే వారికి దాదాపుగా 1800 నుంచి 2000 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు 1200 నుంచి 1500 క్యాలరీల వరకు శక్తినిచ్చే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో మిగిలిన క్యాలరీల కోసం శరీరం కొవ్వుపై ఆధారపడుతుంది. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అలాగే ఎక్సర్‌సైజ్ చేస్తే మరిన్ని క్యాలరీల శక్తి అవసరం కనుక మరిన్ని క్యాలరీల కోసం శరీరం మరింత కొవ్వును కరిగిస్తుంది. ఇలా రెండు విధాలుగా (ఎక్సర్‌సైజ్ + డైట్) బరువు తగ్గవచ్చు.