Advertisement
మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వంటల కంటే పక్క రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన వంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టిఫిన్స్ కు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడో పుట్టిన వాటిని నెత్తిన పెట్టుకుంటూ ఉంటాం. అలా పెట్టుకున్న వాటిల్లో ముందు ఉండేది మైసూర్ బజ్జీ. అసలు అది ఎక్కడ పుట్టింది ఏంటీ అనేది చాలా మందికి అవగాహన లేదు.
Also Read: ఓటర్ కార్డుకి ఆధార్ ఎందుకు లింక్ చేయడం లేదు…?
మైసూరు లో పుట్టింది కాబట్టి మైసూర్ బజ్జీ అంటున్నారా…? అసలు దాని కథ ఏంటో చూద్దాం. బొండాలను తెలుగులో మసూర్ బజ్జీ అని కూడా పిలుస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి మంచి క్రేజ్ ఉంటుంది. ఉదయం ఫలహారంగానూ సాయంత్రాలు చిరుతిండిగానూ దీన్ని తింటారు. ఈ బోండాలకి చాలా చరిత్ర ఉంది. చరిత్ర ఉంది. 12 వ శతాబ్దంలో కర్నాటకను ఏలిన సోమేశ్వరుడు బోండా తయారీ విధానాన్ని మానసోల్లాస అనే సంస్కృత నిఘంటువులో ప్రస్తావించారు.
Advertisement
Advertisements
Advertisements
దక్షిణ భారతం అంతటా చాలా బాగా ప్రసిద్ధి చెందిన ఈ బోండాల పుట్టినిల్లు కర్నాటక. ఈ మైసూరు బజ్జీ పేరు విషయానికి వస్తే కర్నాటకను మైసూరు రాష్ట్రంగా పిలిచే వారు. అక్కడి ఎద్దులను కూడా మైసూరు ఎద్దులు అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి వీటిని మైసూరు బజ్జీలుగా పిలవడం మొదలుపెట్టి ఉండవచ్చు. సాదా బోండాలను మైదా పిండితో, ఉల్లి బోండాలని ఇడ్లీ పిండితో తయారు చేస్తారు. వాస్తవాన్నికి ఉల్లి బొండాలను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పునుగులు అని పిలుస్తూ ఉంటారు. కర్నాటకలోని మంగళూరులో వీటి పేరు గోళిబజె.