Advertisement
కరోనా టైం లో క్రెడిట్ కార్డు అవసరం చాలా పెరుగుతుంది. క్రెడిట్ కార్డు వాడకం పెరగడంతో బ్యాంకు లు కూడా పిలిచి మరీ కార్డులు ఇస్తున్నాయి. ఇక కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునేవారికి ఏ బ్యాంకు లో తీసుకోవడం మంచిది అనే అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. మొదటిసారి తీసుకునే వారైతే మాత్రం మీ జీతం పడే ఖాతా లేదా వ్యాపార లావాదేవీలు జరిగే ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో అక్కడ తీసుకోవడం మంచిది. దానికి కారణాలు ఒకసారి చూస్తే…
Also Read:వాటర్ బాటిల్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా…? బాటిల్ లో నీళ్ళు ఎన్ని గంటల్లో తాగాలి…?
Advertisement
మన ఆదాయం గురించి వాళ్లకు ఒక అవగాహన ఉంటుంది. లావాదేవీలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి క్రెడిట్ లిమిట్ ను పెంచే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడినపుడల్లా వచ్చే పాయింట్లు ఆ బ్యాంక్ యాప్స్ తో తేలికగా రెడీం చేసుకునే అవకాశం ఉంటుంది. బిల్లు చెల్లింపులు విషయానికి వస్తే బ్యాంకు యాప్ లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే విధంగా మనం క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం ఆలస్యమైతే మన ఖాతాలో నుండి వాళ్ళే తీసుకుంటారు.
Advertisements
అదే బ్యాంకు వేరేది అయితే మాత్రం… మనకు ఫోన్ చేయడమా లేక ఇళ్ళకి రావడమా ఏదొకటి జరుగుతూ ఉంటుంది. కస్టమర్ రిలేషన్ విషయానికి వస్తే… బ్రాంచి మేనేజరు కూడా క్రెడిట్ కార్డు సంబంధించిన విషయాల్లో సహాయపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. మనకు ఉండే ఆఫర్ లు కూడా వాళ్ళే ఫోన్ చేసి చెప్తూ ఉంటారు.
Advertisements
Also Read:కొండ చిలువ మనిషిని మింగుతుందా…? ఏ వయసు వారిని మింగే ఛాన్స్ ఉంది…?