Advertisement
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని ప్రజలు తమ అభిరుచులు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నిత్యం ఆహారం తీసుకుంటుంటారు. ఇక వారి జీవనవిధానం కూడా భిన్నంగా ఉంది. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే.. జపాన్ దేశవాసులు ఆరోగ్యంగా ఉంటారు. అవును.. నిజమే.. అందువల్లే ఆ దేశం ప్రపంచంలోనే ఆరోగ్యవంతమైన దేశంగా పేరుగాంచింది. అమెరికాలో సగటున 100 మందికి 31 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతుండగా.. జపాన్‌లో మాత్రం అది 3.5 శాతంగా ఉంది. అంటే.. జపాన్ వాసులు తమ ఆరోగ్యంపై ఏవిధంగా దృష్టి పెడుతున్నారో.. మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జపాన్‌లో నిజానికి ప్రజలకు ఆరోగ్య, ఆహార క్రమశిక్షణ ఎక్కువ. వారు అనారోగ్యాలను కలిగించే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినరు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎక్కువగా తింటారు. చిన్నతనంలోనే పిల్లలకు పోషకాహారం తీసుకోవడం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండడం.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, జీవనవిధానాన్ని కలిగి ఉండడం.. తదితర అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. అందువల్ల వారికి చిన్నప్పుడే ఆరోగ్యకరమైన ఆహారం ఏది, అనారోగ్యకరమైన ఆహారం ఏది.. అనే విషయాలపై పరిపూర్ణ అవగాహన వస్తుంది. అందుకని వారు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటారు. అనారోగ్య సమస్యలను కలిగించే జంక్ ఫుడ్ జోలికి వారు దాదాపుగా వెళ్లరు.
Advertisement
వైట్ రైస్ తింటే బరువు పెరుగుతారనే అపోహ చాలా మందికి ఉంటుంది. అయితే ఆ విషయంలో ఎంతమాత్రం నిజంలేదు. ఎందుకంటే జపాన్ వాసులు నిత్యం తీసుకునే ఆహారంలో ఎక్కువగా అన్నమే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ వారు అన్నం వండేందుకు ఎక్కువగా రైస్ కుక్కర్లను వాడుతారు. ఇక అన్నంతోపాటు వారు చేపలు, చికెన్, గ్రీన్ సలాడ్, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. అందువల్లే వారు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు.
ప్రపంచంలో అనేక దేశాల్లో మనకు జంక్ ఫుడ్ చాలా సులభంగా దొరుకుతుంది. కానీ జపాన్‌లో అలా కాదు. అక్కడ ఆరోగ్యవంతమైన ఆహారమే ఎక్కువగా దొరుకుతుంది. అలా లభించేలా వారే పద్ధతులను పాటిస్తున్నారు. కాబట్టే జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన దేశంగా మారింది. అక్కడ వారు కఠినమైన ఆహార పద్ధతులను పాటిస్తారు. ఎంత పనిచేస్తున్నాం, ఏ మేర ఆహారం తీసుకోవాలి.. అని లెక్కలు వేసి మరీ వారు ఆహారం తీసుకుంటారు. అలాగే వారు ఎక్కువగా కాలేజీలు, స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్తే కాలినడక లేదా సైకిళ్లను ఉపయోగిస్తారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు.
Advertisements
ఇక జపాన్ వాసుల ఆరోగ్య రహస్యం గ్రీన్ టీ. అక్కడ కోకా కోలా వంటి పానీయాలకు బదులుగా గ్రీన్ టీ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. అమెరికాలో ఒక మీడియం డ్రింక్ కోలాను జపాన్‌లో లార్జ్ సైజ్ కోలాగా భావిస్తారు. అవును.. అందుకనే జపాన్ వాసులు ఇతర దేశాల వారికి ఆరోగ్యంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక జపాన్ వాసులకు కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఎక్కువే. అందువల్లే వారు ఇతర దేశాల వారితో పోలిస్తే శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటారు. అదే వారి దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా మార్చింది.
Advertisements