Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

దేశంలోనే అత్యంత ప‌వ‌ర్ ఫుల్ , సేఫెస్ట్ ఇల్లు ఇదే! ఈ ఇంటిపై నుండి ఎగ‌రడానికి వేటికి అనుమ‌తి ఉండ‌దు!

Advertisement

ఈ ప్ర‌శ్న‌కు స‌హ‌జంగానే చాలా మంది స‌మాధానం చెబుతారు.. ముకేష్ అంబానీదే చాలా ప‌వ‌ర్‌ఫుల్ ఇల్లు అని అంటారు. అయితే వారు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. ముకేష్ అంబానీది చాలా సుర‌క్షిత‌మైన ఇల్లే.. కానీ అంత‌కు మించిన సుర‌క్షితమైన నివాసం కూడా ఉంది. అదే.. ప్ర‌ధాని నివాసం.. అవును.. మ‌న దేశంలో ప్ర‌ధాని మోదీ నివాసం ఉండే ప్రాంతం అత్యంత సుర‌క్షిత‌మైంది. దాని గురించిన విశేషాల‌పై ఓ లుక్కేద్దామా..!

ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని 7, లోక్ క‌ల్యాణ్ మార్గ్‌లో నివాసం ఉంటారు. అది ప్ర‌ధాని అధికారిక నివాసం. గ‌తంలో 7, రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవారు. కానీ దాన్ని లోక్ క‌ల్యాణ్ మార్గ్‌గా పేరు మార్చారు. 1920, 1930ల‌లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటీన్స్ బృందంలోని మ‌రో ఆర్కిటెక్ట్ రాబ‌ర్ట్ టోర్ ర‌స్సెల్ భార‌త ప్ర‌ధాని అధికారిక నివాసానికి గాను బంగళాల‌ను డిజైన్ చేశారు. అది మొత్తం 12 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంటుంది. 1980ల‌లో ఆ నిర్మాణాల‌ను పూర్తి చేశారు.

ప్ర‌ధాని నివాసంలో మొత్తం 5 బంగ‌ళాలు ఉంటాయి. 1, 3, 5, 7, 9 అని వాటికి పేర్లుంటాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌స్తుతం 5వ నంబ‌ర్ బంగ్లాలో ఉంటున్నారు. ఇక ఆ బంగ‌ళాల చుట్టూ అనేక వృక్షాలు, మొక్క‌లు ఏపుగా పెరిగి ప్రాంగ‌ణం మొత్తం ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. ముఖ్యంగా అనేక వ‌న‌మూలిక‌ల‌కు సంబంధించిన మొక్క‌ల‌తోపాటు వృక్షాలు కూడా ప్ర‌ధాని నివాసంలో ఉంటాయి. గుల్‌మోహ‌ర్, అర్జున వృక్షాలు ఆవ‌ర‌ణ‌లో ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ప‌లు ర‌కాల ప‌క్షుల‌ను కూడా ప్ర‌ధాని నివాసంలో పెంచుతున్నారు.

Advertisement

Narendra-Modi

Advertisements

1984లో అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ మొద‌ట ఈ నివాసంలో ఉండ‌డం మొద‌లు పెట్టారు. త‌రువాత వీపీ సింగ్‌, ఇప్పుడు ప్ర‌ధాని మోదీలు ఈ అధికారిక నివాసంలో ఉండడం ప్రారంభించారు. నివాసం ప్ర‌ధాన ద్వారంతోపాటు మొత్తం నిర్మాణాల చుట్టూ స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ (ఎస్‌పీజీ) క‌మాండోల నిఘా నిరంత‌రం ఉంటుంది. అందువ‌ల్ల లోప‌లికి ఎవ‌రూ అంత సుల‌భంగా చొర‌బ‌డ‌లేరు.

Advertisements

ప్ర‌ధాని అధికారిక నివాసానికి సంబంధించిన ఎలాంటి ఫొటోలూ ఎక్క‌డా అందుబాటులో లేవు. ఆఖ‌రికి ఇంట‌ర్నెట్‌లోనూ ఆ నివాసం ఫొటోలు లేవు. క‌న‌బ‌డ‌వు. 1వ నంబ‌ర్ బంగ్లాపై హెలీప్యాడ్ ఉంటుంది. అక్క‌డి నుంచి స‌ఫ్దార్‌జంగ్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు సుమారుగా 1.5 కిలోమీట‌ర్ల పొడ‌వు గ‌ల భూగ‌ర్భ మార్గం ఉంటుంది. అందులో ప్ర‌ధాని ప్ర‌యాణించి నేరుగా వీవీఐపీ హెలికాప్ట‌ర్లు ల్యాండ్ అయ్యే ద‌గ్గ‌రికి వెళ్ల‌వ‌చ్చు. ఇక బంగ్లా నంబ‌ర్ 9లో ఎస్‌పీజీ క‌మాండోలు ఉంటారు. అందులో టెన్నిస్ కోర్టు ఉంటుంది. ప్ర‌ధాని నివాసంపై ఉన్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించారు. అక్క‌డ గాలిలో వేటినీ అనుమ‌తించ‌రు.