Advertisement
టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ రకాల్లో ఏ వాషింగ్ మెషీన్లు బెస్ట్ అనే దాని మీద చాలా మందికి అవగాహన లేదు. వాషింగ్ మెషిన్ వాడే విషయంలో కొనే విషయంలో కాస్త అవగాహన అవసరం అనే చెప్పాలి. అసలు ఏ రకం వాషింగ్ మెషిన్ మంచిదో ఒకసారి చూద్దాం.
Also Read:అఘోరాలు శవం మాంసం ఎందుకు తింటారు…?
టాప్ లోడ్ మెషీన్లలో, ఒక బట్ట మరొక బట్టతో రుద్దుకోవటం లేదా రాపిడి ద్వారా బట్టలు వాష్ అవుతూ ఉంటాయి. బట్టల చుట్టూ ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. ఎక్కువ నీరు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి… సర్ఫ్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఫ్రంట్ లోడ్ మెషీన్లలో మాత్రం ఆవిధంగా ఉండదు. ఫ్రంట్ లోడ్ మెషీన్లలో రెండు డ్రమ్ లు ఇస్తారు. తెడ్డులతో కదిలే లోపలి డ్రమ్, నీరు ఉండి కదలని మరో డ్రమ్.
Advertisement
Advertisements
బట్టలను నీళ్ళలోకి లాగి… వాటిని పైకి తిప్పుతూ నడుస్తుంది. లోపలి డ్రమ్ లో ఉన్న తెడ్డులు బట్టలకు రివర్స్ మార్గంలో తిరగడంతో బట్టలు క్లీన్ అవుతాయి. తక్కువ నీరు, తద్వారా తక్కువ డిటర్జెంటు తీసుకుంటుంది. బట్టలు కూడా ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉండదు. డిటర్జెంట్ తక్కువ పడే అవకాశం ఉండటంతో నురగ లాంటివి ఉండే అవకాశం ఉంది. బట్టల మన్నిక, మురికిని వదిలించే విషయం, వాటిని ఉతికే విధానం చూసుకుంటే… ఫ్రంట్ లోడ్ మెషీన్ లే… టాప్ లోడ్ మెషీన్లకంటే చాలా బెస్ట్.
Advertisements
Also Read:ఈ జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ అంటే చుక్కలే, మోడీ కేవలం మూడు నిమిషాలే ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎవరు ఆయన…?