Advertisement
భారత దేశం భిన్న జాతులకు నిలయం. ఎన్నో వర్గాలు, కులాలు, మతాలకు చెందిన ప్రజలు భారత్‌లో నివాసం ఉంటున్నారు. వారిలో పార్సీలు కూడా ఒకరు. వీరు నిజానికి జొరాస్ట్రియన్ వర్గానికి చెందిన వారు. అందులో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన పార్సీలు ఇండియాలో నివసిస్తున్నారు. వీరు ముస్లిం చక్రవర్తుల కాలంలో భారత్ కు వచ్చి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రధానంగా గుజరాత్ తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ మనకు పార్సీలు ఎక్కువగా కనిపిస్తారు.
పార్సీలు జొరాస్ట్రియనిజం అనే మతాన్ని అనుసరిస్తారు. ఇరాన్ దేశస్థులు కూడా ఈ మతస్థులే. అక్డ ససానిద్ కాలం నుంచి ఈ మతాన్ని వారు అనుసరిస్తూ వస్తున్నారు. వీరు ఇతర కులాలు, మతాలకు చెందిన వారిని తమ మతంలోకి మారేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు. ఇక వివాహాలు కూడా వీరు తమ మతస్థులనే చేసుకుంటారు. మన దేశంలో సుమారుగా 60వేల నుంచి 70వేల మంది పార్సీలు ఉన్నట్లు అంచనా.
Advertisement
ఇక జొరాస్ట్రియన్లలో రెండో వర్గానికి చెందిన పార్సీలు ఇరాన్‌లో ఎక్కువగా ఉన్నారు. వీరు కజర్ సామ్రాజ్యం సమయంలో వచ్చారు. ఇండియా తరువాత అత్యధిక సంఖ్యలో జొరాస్ట్రియన్లు కలిగి ఉన్న దేశం ఇరాన్ కావడం విశేషం.
Advertisements
ఫరావహర్, జొరాస్ట్రియన్ మతస్థుల మతపరమైన చిహ్నం
Advertisements
పార్సీ మతంలోని ప్రముఖులు.
- దాదాభాయి నౌరోజీ
- జమ్షెట్ జీ టాటా
- ఫిరోజ్ షా మెహతా
- ఫిరోజ్ గాంధీ
- గోద్రెజ్ కుటుంబం, టాటా కుటుంబం.