Advertisement
దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పేరుంది. దేశవిదేశాల నుంచి ఎంతో మంది భక్తులు నిత్యం వేల సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే కలియుగ దైవమని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో, దీని చరిత్ర ఏమిటో తెలుసా..? ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి కలియుగ ఆరంభంలో నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒక రోజు తొండమాన్ చక్రవర్తికి కల వస్తుంది. అందులో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. తాను కలియుగాంతం వరకు కొండపై వెంకటేశ్వరుడి అవతారంలో ఉంటానని చెబుతాడు. అందుకు తనకు ఓ ఆలయాన్ని నిర్మించాలని స్వామి కోరుతాడు. దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మచే అంగరంగ వైభవంగా ఆలయాన్ని నిర్మిస్తాడు.
Advertisement
Advertisements
తిరుమల ఆలయాన్ని వైఖానస ఆగమం ప్రకారం నిర్మిస్తారు. అందుకనే ఇప్పటికీ ఆలయంలో పూజలు ఆ ఆగమం ప్రకారమే కొనసాగుతాయి. ఇక తొండమాన్ చక్రవర్తి తరువాత అనేక మంది రాజులు తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయంలోని ఆనంద నిలయం గోపురానికి బంగారంతో అనేక సార్లు రాజులు తాపడం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా తన హయాంలో గోపురానికి బంగారంతో తాపడం చేయించారు. అలాగే అనేక రకాలుగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అందులో తరువాతి కాలం నుంచి మరమ్మత్తులు కూడా చేపడుతూ వస్తున్నారు. ఇదీ.. తిరుమల ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథ.
Advertisements