Advertisement
అరియానా…..పిట్టకొంచెం కూత ఘనం అన్న రీతిలో బిగ్ బాస్ షో లో అందర్నీ అలరిస్తు సాగుతోంది ఈమె గేమ్! అంతగా పాపులారిటీ లేకపోయినా తన ముందు హేమాహేమీలు ఎలిమినేట్ అవుతూ వస్తున్నా…. తను మాత్రం రోజు రోజుకు తన ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతుంది!
బిగ్ బాస్ వరకు తను ఎలా చేరింది?
చాలా మంది చెప్పే సమాధానం….RGVతో అరియానా చేసిన ఇంటర్వ్యూ! ఆ ఇంటర్వ్యూలో RGV అరియానాతో నిన్ను బికినీలో చూడాలని ఉంది అన్నాడు….ఆతర్వాత ఈ వీడియోస్ బేస్ చేసుకొని అనేక మీమ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. అలా అరియానా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది…కొన్ని రోజుల పాటు అరియానా RGVట్రెండింగ్ టాపిక్స్ అయ్యింది!
Advertisements
అంతకు ముందు ?
అరియానా జెమిని టివిలో కెవ్వు కామెడీ షోకు యాంకర్‌గా చేసింది. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే యాంకర్ గా చేసింది. మొదట్లో 4 వేల రూపాయల జీతానికి జాబ్ చేసిన అరియానా…. 500 రూపాయలకు ఈవెంట్లకు యాంకరింగ్స్ కూడా చేసిందట!
Advertisement
పర్సనల్ లైఫ్
అరియానా అసలు పేరు అర్చన. అరియానా అమ్మ గవర్నమెంట్ నర్స్. వాళ్ల తల్లిదండ్రులది లవ్ మ్యారేజ్., కానీ అరియానా 5 ఏళ్ల వయస్సులో అభిప్రాయ బేధాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి అమ్మే ఇద్దరు పిల్లల్ని పెంచుతూ పెద్ద చేసింది.
బిగ్ బాస్ ఏంట్రీ లో చెప్పిన డైలాగ్..
కట్టుబాట్ల సమాజంలో ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు . కానీ నేను మాత్రం కాలం అందుకోలేనంత వేగంగా పరుగులు తీస్తూ ఎన్నో పనులు చేశా అందుకే నేను బోల్డ్.! అంటూ ఫిలాసఫిని తన ఆటిట్యూడ్ ను స్ఫష్టంగా బిగ్ బాస్ హౌస్ ఎంట్రీలోనే చెప్పింది అరియానా.!
Watch Video:
Advertisements