Advertisement
CK , కల్నల్ CK నాయుడు , కొట్టారి కనకయ్య నాయుడు…… ఈతరం క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్దగా తెలియని పేరు.! 90 సంవత్సరాల క్రిందట భారత క్రికెట్ టీమ్ మొదటి కెప్టెన్ ఈ CK ! ఈయన మన తెలుగు వాడు కావడం మన గర్వకారణం. ఆయన క్రికెట్ ఆడే రోజుల్లో….. CK అంటే సిక్సర్స్ , సిక్సర్స్ అంటే CK అనేవారు! ఆయన పెవిలియన్ నుంచి బ్యాటింగ్ చేయడానికి నడిచివస్తుంటే సింహం వేటకు బయల్దేరినట్టు ఉండేదట!
CK ధైర్యానికి సంబంధించిన రెండు ఉదాహరణలు
1. 1936 లో ఆయన లండన్ లో చివరి మ్యాచ్ ను ఆడుతున్నాడు…అప్పుడు ఇంగ్లాండ్ బౌలర్ గబ్బి LN బౌన్సర్ వేయగా అది CK ఛాతీపై బలంగా తగిలింది…వెంటనే CK కుప్పకూలిపోయాడు…వెంటనే తేరుకొని నెక్ట్స్ బాల్ ను సిక్సుగా మలిచాడు.
2. 57 సంవత్సరాల వయస్సులో రంజి ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో దత్తు ఫట్కార్ అనే బౌలర్ వేసిన బౌన్సర్ CK మూతికి తగిలి మూడు పళ్లు విరిగాయి… వెంటనే బ్యాట్ తో ఆ పళ్లని పక్కకు నెట్టి మళ్ళీ బ్యాటింగ్ రెడీ అయిపోయాడు…ఆ మ్యాచ్ లో 50 పైగా పరుగులు చేశాడు.!
Advertisements
Advertisement
Advertisements
- 1916 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ను సిక్స్ తో స్టార్ట్ చేశాడు.!
- సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో మొయినుద్దౌలా టోర్నమెంట్ అడుతున్నప్పుడు అతను కొట్టిన సిక్సర్ రోడ్డుకు అవతలవైపు ఉన్న ప్లాజా సినిమా హాల్లో పడిందట!
- బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో ఆడుతునప్పుడు ఆయన కొట్టిన సిక్సర్ దగ్గరలో ఉన్న సాగర్ టాకీస్ లో పడిందట .
- ఆయన టెస్ట్ క్రికెటర్ లో అడుగు పెట్టినప్పుడు ఆయన వయసు 37 సంవత్సరాలు ఎందుకంటే ,,,, అంతకు ముందు టెస్ట్ క్రికెట్ అనేదే లేదు . భారత క్రికెట్ టీమ్ కూడా లేదు. మన ఇండియన్ టీమ్ కు ఆయనే మొదటి కెప్టెన్ .
- నాయుడు తనకి 51 సంవత్సరాల వయస్సులో రంజీ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసాడు. ఆయన చిట్టచివరి మ్యాచ్ ఆడినప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు .
- టీవీ యాడ్ లలో కనిపించిన మొట్టమొదటి క్రికెటర్ సి కె నాయుడు . భారతదేశ ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న తొలి క్రికెటర్ కూడా నాయుడే .