Advertisement
భారతదేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఎన్నో రాజ వంశాలు రాజ్యమేలాయి. అంతరించిపోయాయి. అయితే భారతదేశాన్ని పరిపాలించిన రాజులందరిలోనూ అత్యంత బలవంతుడైన రాజు ఎవరనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిజంగా అలాంటి రాజు ఉన్నాడా..? అని కొందరు ప్రశ్నిస్తారు. అయితే అందుకు ఉన్నాడనే.. సమాధానం చెప్పవచ్చు. అవును.. భారతదేశ చరిత్రలో సముద్రగుప్తున్ని అత్యంత బలమైన రాజు అని చెప్పవచ్చు. ఆయన్ను రాజులకే రాజు అని.. చక్రవర్తి అని అంటారు.
సముద్రగుప్తుడు ఉత్తరాన ఉన్న హిమాలయాల నుంచి దక్షిణాన ఉన్న నర్మదా నది వరకు, తూర్పున ఉన్న బ్రహ్మపుత్ర నది నుంచి పడమరన ఉన్న యమునా నది వరకు అనేక రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఉత్తరాన నాగ వంశానికి చెందిన రాజులను ఓడించాడు. దక్షిణాన మరో 12 మంది రాజులను ఓడించి.. అన్ని రాజ్యాలను కలిపి ఒకే రాజ్యంగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు.
సముద్రగుప్తుడు కళలను ఆరాధించేవాడు. అతని ఆస్థానంలో హరిసేన అనబడే కవి ఉండేవాడు. అతను సముద్ర గుప్తుడి ధైర్య సాహసాలను వర్ణిస్తూ శాసనాలు రాసేవాడు. వాటిని అలహాబాద్ స్తంభంపై చూడవచ్చు. సముద్రగుప్తుడు వీణ లాంటి వాయిద్యాన్ని ఎక్కువగా వాయించేవాడు. అందుకు సాక్ష్యాలుగా అతనికి చెందిన పలు విగ్రహాలు, చిత్రాలను మనం చూడవచ్చు.
Advertisements
సముద్రగుప్తుడు తన హయాంలో పలు నాణేలను కూడా ప్రవేశపెట్టాడు. సాధారణ నాణేలతోపాటు విలువిద్య, యుద్ధ విద్యలను ప్రతిబింబించే నాణేలు, అశ్వమేథ, పులిని చంపే వారి నాణేలు, రాజు, రాణి, గాయకుడి నాణేలను ముద్రించాడు. సముద్రగుప్తుడు తన రాజ్యంలో ఆర్థిక వ్యవస్థను కూడా పరిపుష్టంగా ఉంచేవాడు.
Advertisement
సముద్రగుప్తుడు పరిపాలించిన కాలాన్ని చరిత్రకారులు స్వర్ణ యుగం, గుప్తుల యుగం అని పిలుస్తారు. అతను ఎన్నో రాజ్యాల మధ్య శాంతి నెలకొల్పాడు. ఇతర దేశాలకు చెందిన రాజులతో సఖ్యతగా ఉండేవాడు. అప్పట్లో బోధ్ గయ వద్ద బౌద్ధ సన్యాసుల కోసం ప్రత్యేక ఆశ్రమాన్ని నిర్మించేందుకు సముద్రగుప్తుడు సెయ్‌లాన్ రాజుకు అనుమతి కూడా ఇచ్చాడు.
సముద్రగుప్తుడు ఏ యుద్ధంలో అయినా సరే విజయం సాధించేవాడు. అతను చురుకైన యుద్ద వ్యూహాలను రచించేవాడు. అందుకనే ప్రతి యుద్ధంలోనూ విజయం అతన్ని వరించేది. ఇక యుద్ధాల్లో అతనికి తీవ్ర గాయాలు అయ్యేవి. గొడ్డళ్లు, బాణాలు, బరిసెలు, మేకులు, కత్తులు తదితర అనేక ఆయుధాల దాడికి అతను గురయ్యేవాడు. ఆయా ఆయుధాలు చేసిన గాయాల తాలూకు మచ్చలు కూడా అతని శరీరంపై ఉండేవి. అయినా అతను చాలా దృఢమైన శరీరం కలవాడు కనుక వాటిని కూడా తట్టుకునేవాడు. అందుకనే అతను బలమైన రాజు అయ్యాడు.
ఒకప్పుడు వినాశనం అయిన మౌర్య వంశానికి చెందిన రాజుల సైన్యంతో పోలిన సైనిక బలం సముద్ర గుప్తుడికి ఉండేదట. ఇక సముద్రగుప్తుడు తాను పాలించే పట్టణాల చుట్టూ భారీ గోడలను నిర్మించేవాడట. సరిహద్దుల వద్ద సైనికుల గస్తీని ముమ్మరం చేసేవాడట.
Advertisements
సముద్రగుప్తుడు ఒకానొక సమయంలో అశ్వమేధ యాగం కూడా చేశాడట. అప్పట్లో అతనికి ఉన్న బలం కారణంగా ఏ రాజూ అందుకు అడ్డుచెప్పలేదట. ఇక సముద్ర గుప్తున్ని నెపోలియన్‌తో పోలుస్తారు. కానీ నెపోలియన్ అధికార దాహం కలిగి ఉండేవాడు. సముద్రగుప్తుడికి అది లేదు. అందరితోనూ సఖ్యంగానే ఉండేవాడు. అన్ని రాజ్యాల మధ్య శాంతిని నెలకొల్పాడు. కనుక నెపోలియన్‌కు, సముద్ర గుప్తుడికి పోలికే లేదని, సముద్ర గుప్తుడే బలమైన రాజు అని చరిత్రకారులు చెబుతారు.