Advertisement
బ్యాంకు అకౌంట్లకు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయడాన్ని చట్ట బద్ధం చేసింది భారత ప్రభుత్వం. అయితే ఓటర్ కార్డుల విషయంలో మాత్రం ఆ నిర్ణయం తీసుకోవడం లేదు. దీనిపై విమర్శలు రావడంతో కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు. దొంగ ఓట్లను అరికట్టే అవకాశం ఉంటుందని కాబట్టి అలా చేయాలని కొందరు కోరుతున్నారు.
Also Read : లగ్జరీ కార్లలో స్టీరింగ్ ఎందుకు వైబ్రేట్ అవుతుంది…? అసలు ఆ కార్లలో ఉండే సౌకర్యాలు ఏంటీ…?
అయితే ఓటర్ కార్డ్ లకు చాలా తిరకాసులు ఉన్నాయి కాబట్టే ఈ విషయంలో అడుగు వేయడం లేదు. కొన్ని ఉదాహరణలు చూస్తే… శ్రీకాకుళం లో ఒక దంపతులకు 18 ఏళ్లు నిండిన కొడుకు ఉన్నాడు అనుకుందాం. హైదరాబాద్ లో చదువుతాడు కాబట్టి… అతనికి ఓటు ఎక్కడ ఉంటే బాగుంటుంది…? పోనీ ఉద్యోగం ఎక్కడ చేస్తాడు…? అతనికి ఉపయోగాలు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు వేస్తాడు.
Advertisement
Advertisements
Advertisements
బెంగుళూర్, హైదరాబాద్ లకు చాలా మంది వలస వస్తారు. వచ్చిన ఆరు నెలల్లో వోటర్ కార్డ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చేయించుకుంటే ఆధార్ కార్డు ఒక చోట, మనిషి ఒక చోట ఉంటాడు. అది పెద్ద సమస్యే కదా మరి…? అక్రమంగా వలస వచ్చిన వారికి ఇది పెద్ద తలనొప్పిగా ఉంటుంది. దీనితో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టే కేంద్రం గాని ఎన్నికల సంఘం గాని అడుగు వేయడం లేదు.