Advertisement
చీమలు.. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే.. అద్భుతమైన ప్రాణులు. అవి చూసేందుకు సైజులో చాలా చిన్నగానే ఉంటాయి. కానీ అవి చాలా దృఢంగా ఉంటాయి. తమ ఆహారం కోసం అవి ఎంతో దూరం ప్రయాణిస్తాయి. పెద్ద పెద్ద బరువులను మోస్తాయి. తమ శరీరం కన్నా ఎక్కువ సైజులో ఉండే ఆహారాన్ని మోస్తూ ఎక్కడికో తీసుకెళ్లి ఆ ఆహారాన్ని దాచుకుంటాయి. అయితే ఎప్పుడు చూసినా చీమలు మనకు ఒకే లైన్లో వెళ్తూ కనిపిస్తాయి. అవును కదా.. సరిగ్గా క్యూ పద్ధతిని పాటిస్తూ అవి ముందుకు సాగుతుంటాయి. నిజానికి మనుషులు కూడా క్యూ సరిగ్గా పాటించరు. కానీ చీమలు ఒకే లైన్‌లో ఒకదాని వెనుక ఒకటి బారులు తీరి వెళ్తుంటాయి. అయితే చీమలు అలా ఎందుకు వెళ్తాయో తెలుసా ? వంకర టింకరగా కాకుండా ఒకదాని వెనుక ఒకటి అంత పద్ధతిగా ఎందుకు వెళ్తాయోనని ఎప్పుడైనా ఆలోచించారా ? సరిగ్గా ఆ విషయం వెనుక ఉన్న మిస్టరీనే ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
చీమలకు ఊపిరితిత్తులు, చెవులు ఉండవు. కానీ ముక్కు ఉంటుంది. అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే.. కుక్కలు దేన్నయినా వాసన చూసి పసిగడతాయి కదా.. సరిగ్గా కుక్కలకు ఉండే శక్తివంతమైన ముక్కు చీమలకు ఉంటుంది. అవును.. ఇది నిజమే. ఈ క్రమంలోనే ముందు వెళ్లీ చీమ Pheromone అనబడే ఓ రసాయనాన్ని వదులుతుంది. దాన్ని వాసన చూసిన మరో చీమ దాన్ని వెనుకే ఫాలో అవుతుంది. ఆ చీమ మళ్లీ ఆ రసాయనాన్ని వదులుతుంది. దీంతో దాని వెనుక వచ్చే మరో చీమ.. ఆ పై వచ్చే చీమలు.. అన్నీ.. అలా.. అలా ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతూ.. ఆ రసాయన సెంట్‌ను వదులుతూ వస్తాయి. అందుకనే అవి పొడవైన లైన్లలో, క్యూ పద్ధతిలో వెళ్తూ మనకు కనిపిస్తాయి. ఇక ఆహారాన్ని సంపాదించగానే మళ్లీ అవి అలాగే వెళ్తాయి.
Advertisements
ఎర్ర చీమలు, నల్ల చీమలు.. ఇలా ఏ చీమలు అయినా సరే.. ప్రత్యేకమైన సెంట్‌ను వదులుతూ వెనుకాలే చీమలకు దారి చూపిస్తాయి. అందుకనే అవి ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతూ పొడవైన లైన్లలో వెళ్తుంటాయి. ఇదీ.. వాటి క్యూ పద్ధతి వెనుక ఉన్న అసలు రహస్యం.
Advertisements
అయితే దీనిపై మీరు కావాలనుకుంటే ఎక్స్‌పరిమెంట్ కూడా చేయవచ్చు. ఒక ఎరేజర్ తీసుకుని చీమలు వెళ్లే దారిని మధ్యలో ఎరేజ్ చేసినట్లు తుడిచేయండి. దీంతో చీమలు గందరగోళానికి గురై అడ్డ దిడ్డంగా వెళ్తాయి. తరువాత కొంత సేపటికి అవి మళ్లీ లైన్లో వెళ్తాయి. అయితే ఈ ప్రయోగంతో చీమలను మాత్రం ఇబ్బంది పెట్టకండి. పాపం అవి కన్‌ఫ్యూజ్ అవుతాయి.