Advertisement
రైలు ప్రయాణం ఒక అద్భుతం అయితే రైలు తయారి, రైలు పట్టాల నిర్మాణం మహాద్భుతం అనే చెప్పాలి. బ్రిటీష్ కాలంలో మనదేశంలో విస్తృతంగా రైల్వే వ్యవస్థ బలపడింది. ఆ తర్వాత మన దేశంలో చాలా తక్కువగా రైల్వే అభివృద్ధి జరిగింది అనే ఆరోపణలు వినపడుతూ ఉంటాయి. కీలక నగరాల నుంచి ఒక మోస్తారు నగరాల వరకు కూడా రైల్వే లైన్ ల నిర్మాణం జరిగింది.
Read Also:సముద్రపు నీటిలో మంచి నీరు కలవదా…? ఏ నీళ్ళు బరువు ఎక్కువ…?
సంపద దోచుకోవడానికి తెల్లవాడు ఏ ఒక్క వ్యవస్థను కూడా వదలలేదు అనడంలో సందేహం లేదనే చెప్పాలి. అందుకే రైల్వే ని ఎక్కువగా బలోపేతం చేసాడు. సరే గాని… రైలు పట్టాల మధ్యన పక్కన, రాళ్లు ఉంటాయి. ఆ రాళ్లు ఎందుకు ఉంటాయి ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. ఆ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి ప్రధానంగా నాలుగు ప్రాధమిక ప్రయోజనాలకు ఉపయోగపడతాయని చెప్పాలి.
Advertisement
Advertisements
1. ఇది రైల్వే ట్రాక్ బరువును పంపిణీ చేయడమే కాకుండా భరిస్తుంది. రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్‌లను దృఢమైన స్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయి.
2. ట్రాక్ నుండి నీటిని దూరంగా ఉంచుతుంది.
3. ట్రాక్ యొక్క నిర్మాణానికి ఆటంకం కలిగించే మొక్కలు పెరగకుండా చూస్తుంది.
4. రైలు పట్టాల మీద పోయేటప్పుడు వచ్చే టైం లో శబ్దాన్ని తగ్గిస్తుంది.
గ్రానైట్, ట్రాప్ రాక్, క్వార్ట్జైట్, డోలమైట్ లేదా సున్నపురాయి యొక్క సహజ నిక్షేపాల నుండి బ్యాలస్ట్ ను ఉత్పత్తి చేస్తారు.
Advertisements
Read Also:ఉదయం త్వరగా నిద్ర లేవాలంటే ఏం చేయాలి…?