Advertisement
క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ టెండుల్కర్ దేవుడు.. ఈ వాక్యం సచిన్‌ను ఉద్దేశించే పుట్టింది. సచిన్‌ను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది క్రికెట్ రంగంలోకి వచ్చి సెటిల్ అయ్యారు. మాస్టర్ బ్లాస్టర్‌గా సచిన్ పేరిట ఉన్న రికార్డులను ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేదు. సచిన్ పేరు చెబితే చాలు స్టేడియాల్లో ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. అయితే అంతటి ఘనత కలిగిన వ్యక్తి కుమారుడు మాత్రం ఇంకా క్రికెట్ లోకి పూర్తి స్థాయిలో రాలేదు.
సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. సాధారణంగా చాలా మంది క్రికెటర్లు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే. కనీసం షూస్ కొనలేని స్థాయిలో ఉండి కూడా ఇప్పుడు ఐపీఎల్‌లో స్టార్లుగా ఆడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున అనేక మ్యాచ్‌లను ఆడారు. అయితే అన్ని సౌకర్యాలు ఉండి, ప్రముఖ క్రికెటర్ కుమారుడు అయినప్పటికీ అర్జున్ టెండుల్కర్ మాత్రం ఇంకా క్రికెట్‌లో రాణించడం లేదు. మరోవైపు అతన్ని ఐపీఎల్‌కు ఎందుకు ఎంపిక చేయలేదనే వాదన ప్రస్తుతం వినిపిస్తోంది.
Advertisement
సచిన్‌కు 16 ఏళ్లు ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాడు. ఇక ఇప్పుడు ఉన్న చాలా మంది ప్లేయర్లు అండర్-19 గేమ్స్‌లో సత్తా చాటి వచ్చినవారే. కానీ అర్జున్ టెండుల్కర్ వయస్సు ప్రస్తుతం 20 ఏళ్లు. అయినప్పటికీ అతను ఏ విభాగంలోనూ అంతగా రాణించలేదు. అయితే కొద్దిగా ప్రతిభ ఉంటే నిజానికి అర్జున్ టెండుల్కర్‌కు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడడం పెద్ద కష్టమేమీ కాదు. అతని తండ్రి సచిన్‌కు ఉన్న పలుకుబడితో ఈజీగా కనీసం ఐపీఎల్‌లో అయినా ఆడి ఉండేవాడు. కానీ అతను ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపిక కాకపోవడానికి కారణం.. అతని ప్రదర్శనే అని తేలింది.
Advertisements
ముంబై ఇండియన్స్ జట్టు నిర్వహించిన మెరిట్ సెలెక్షన్ లో అర్జున్ టెండుల్కర్ అంచనాలను అందుకోలేకపోయాడు. అతను అండర్ 19 క్రికెట్ ఆడుతున్నప్పటికీ ముంబై ఇండియన్స్ మెరిట్ సెలెక్షన్‌లో రాణించలేదు. దీంతో ముంబై ఇండియన్స్ అతన్ని జట్టులోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అర్జున్ ముంబై ఇండియన్స్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ శిక్షణ తీసుకుంటున్నాడు.
అయితే తండ్రులు ఏదైనా రంగంలో నిపుణులు అయినంత మాత్రాన వారి పిల్లలు కూడా అదే రంగంలో రాణించాలనే రూల్ ఏమీ లేదు. కానీ ఇలాంటి విషయాలను మీడియా మాత్రం విడిచిపెట్టదు కదా. మరి అర్జున్ క్రికెట్ లో రాణించి తండ్రి పేరును నిలబెడతాడా ? అనేది వేచి చూస్తే తెలుస్తుంది. ఇక అర్జున్ టెండుల్కర్ ఫాస్ట్ బౌలర్ & ఆల్ రౌండర్. సచిన్ బ్యాట్స్‌మన్‌గానే కాక స్పిన్నర్‌గా కూడా రాణించాడు. కానీ అతని కుమారుడు భిన్న రూట్‌లో వెళ్తున్నాడు..!
Watch Video:
Advertisements