Advertisement
విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడన్న సంగతి తెలిసిందే. రాయలవారి వంశంలో ఆయన హయాంలోనే విజయనగర సామ్రాజ్యం ఎక్కువగా వృద్ధి చెందింది. అప్పటికీ, ఇప్పటికీ రాయలవారి పాలనను జనాలు గుర్తు చేసుకుంటారు. అప్పట్లో రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని చెప్పుకుంటారు. అలాగే ఆయన హయాంలో అమ్మకం, కొనుగోలు ఉండేవి కావు. అంతా వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది. దీంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది. మరోవైపు రాయలవారు కూడా ఎన్నో యుద్ధాల్లో గెలిచి సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేశాడు. అయితే అప్పట్లో మొగల్ చక్రవర్తి బాబర్ అంత బలగం, సైన్యం ఉండి కూడా రాయలవారు అంటే భయపడ్డాడు. ఎందుకంటే..?
Advertisement
అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు నిజానికి బాబర్ కన్నా ఎక్కువ సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు. 1509-1529 మధ్య కాలంలో రాయల సామ్రాజ్యం తన వైభవాన్ని చాటుకుంది. అదంతా రాయలవారి చలవే. అప్పట్లో 50వేల మంది వీర సైనికుల సైన్యంతోపాటు పోర్చుగీసుకు చెందిన ఫిరంగులు కాల్చేవారు, 3200 మంది అశ్వదళం, 600 గజదళం ఉండేవి. ఇవే కాకుండా మరో 4 లక్షల మంది పదాతి దళం ఉండేది. దీంతో అప్పట్లో దక్షిణ ఆసియాలోనే రాయలవారి సామ్రాజ్యం అఖండమైన సైనిక బలాన్ని కలిగి ఉన్న రాజ్యంగా పేరుగాంచింది.
Advertisements
ఇక అప్పట్లో 900కు పైగా ఫిరంగుల సామర్థ్యం ఉన్న బిజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షానే రాయలవారు ఓడించారు. అందువల్ల బాబర్.. శ్రీకృష్ణ దేవరాయల వైపు చూడలేదు. మరోవైపు బాబర్‌కు గరిష్టంగా 50వేల మంది సైనికులు, 50 ఫిరంగులు మాత్రమే ఉండేవి. రాయలవారికి హంపిలో ఉండే సైనిక బలం అది. దాంతో బాబర్ యుద్ధానికి వచ్చినా.. లేదా రాయలవారే స్వయంగా యుద్ధానికే వెళ్లినా బాబర్ ఘోరంగా ఓడిపోయి ఉండేవాడు. అందువల్లే బాబర్ రాయలవారి వైపు చూడలేదు. ఈ క్రమంలో డెక్కన్ సామ్రాజ్యాన్ని రాయలవారి వంశస్థులు 250 ఏళ్లకు పైగా పాలించారు. అయినప్పటికీ రాయలవారి ఉండే ధైర్య పరాక్రమాలు అప్పట్లో ఏ రాజుకూ ఉండేవి కావు. అందుకనే ఆయన శక్తివంతమైన రాజుగా అప్పట్లో కొనసాగారు.
Advertisements