Advertisement
కర్ణాటక రాజధాని బెంగళూరు అని అందరికీ తెలిసిందే. అయితే నిజానికి మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. అనేక వందల సంవత్సరాల కిందటి నుంచి మైసూరు రాజ్యంగా ఉండేది. కానీ స్వాతంత్య్రం వచ్చాక మైసూరును కాదని, బెంగళూరును రాజధానిగా మార్చారు. ఇలా ఎందుకు చేశారు ? అసలు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి..? అంటే…
14వ శతాబ్దం నుంచి మైసూర్ రాజ్యాన్ని వడియార్ కుటుంబం ఏలింది. చాలా ఏళ్లపాటు మైసూరు లేదా శ్రీరంగపట్నం రాజధానులుగా ఉండేవి. బ్రిటిష్ వారు వచ్చాక వడియార్ రాజులు వారితో సంధి కుదుర్చుకున్నారు. ఆ తరువాత 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు మైసూర్‌ను వడియార్‌లే పాలించారు.
అయితే అప్పట్లో మైసూర్ రాజ్యంలో బెంగళూరు భాగంగా ఉండేది. కానీ బ్రిటిష్ వారు ఆ ప్రాంతంపై పూర్తి అజమాయిషీని కలిగి ఉండేవారు. వారికి బెంగళూరు వాతావరణం బాగా నచ్చింది. దీంతో వారు ఆ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్ నుంచి వర్తకం కోసం వచ్చే బ్రిటిషర్ల కోసం బెంగళూరులో బ్రిటిష్ వారు అనేక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisements
Advertisements
బెంగళూరులో బ్రిటిష్ వారు రైల్వే లైన్ నిర్మించారు. టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. టెలిగ్రాఫ్ సౌకర్యం ఉండేది. బ్రిటిష్ కాలనీలు ఏర్పాటయ్యాయి. హాస్పిటల్స్, థియేటర్లు, యూనివర్సిటీలు తదితర అనేక నిర్మాణాలను బ్రిటిష్ వారు తమ కోసం నిర్మించుకున్నారు. దీంతో టెక్నాలజీ పరంగా కూడా బెంగళూరు అప్పట్లోనే ఎంతో అభివృద్ధి చెందింది. ఇక శివన సముద్ర నుంచి బెంగళూరుకు విద్యుత్ ఇచ్చారు. అప్పట్లో మైసూర్ రాజ్యంలో విద్యుత్ వచ్చిన మొదటి ప్రాంతం బెంగళూరు కావడం విశేషం. ఇలా అన్ని రకాలుగా బెంగళూరు అభివృద్ది చెందింది.
అయితే స్వాతంత్య్రం వచ్చాక కర్ణాటక ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంది కనుక బెంగళూరునే తమ రాజధాని చేసుకున్నారు. అలా జరగకపోయి ఉంటే వారి రాజధాని మైసూర్‌గానే ఉండిపోయేది.