Advertisement
బీర్ అంటే మద్యపాన ప్రియులకు ఇష్టమే. ఇతర మద్యం బ్రాండ్లను సేవించే విధంగానే మద్యం ప్రియులు బీర్‌ను కూడా ఎక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో బీర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరెప్పుడైనా గమనించారా ? బీర్ బాటిల్స్ సాధారణంగా బ్రౌన్ లేదా గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. ఇక కొన్ని కంపెనీలు ఎలాంటి కలర్ లేకుండా సాధారణంగానే బీర్ ను బాటిల్స్ లో నింపి అందిస్తుంటాయి. అయితే కేవలం ఈ 3 రకాల రంగులకు చెందిన బాటిల్స్ లోనే బీర్ ను ఎందుకు నింపుతారో, ఇతర రంగు బాటిల్స్ లో బీర్‌ను ఎందుకు నింపరో తెలుసా..? అవే వివరాలపై ఒక లుక్కేద్దాం..!
క్రీస్తు పూర్వం 9000వ సంవత్సరంలోనే ఈజిప్టు, మెసొపొటామియాలలో బీర్‌ను తయారు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే అప్పట్లో ఫ్రిజ్‌లు గట్రా లేవు. కనుక అప్పట్లో ఇతర వస్తువుల్లో బీర్‌ను తయారు చేసి వెంటనే తాగేవారు. ఎక్కువ సేపు ఉంటే బీర్ దుర్వాసన వచ్చేది. కనుక అప్పట్లో బీర్‌ను తయారు చేసిన వెంటనే సేవించేవారు. తరువాత 1850లలో బీర్‌ను సీసాల్లో నింపడం ప్రారంభమైంది. అప్పట్లో ఒక సన్యాసి బీర్‌ను గాజు వైన్ బాటిల్‌లో నింపాడట. తరువాత ఆ విషయాన్ని అతను మరిచిపోయాడట. అయితే తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చి బీర్‌ను చూస్తే ఆ బీర్ ఇంకా తాజాగా ఉందట. అందువల్ల అప్పటి నుంచి బీర్‌ను గ్రీన్ కలర్‌లో ఉండే సీసాల్లో నింపి అమ్మడం మొదలు పెట్టారు.
Advertisement
అయితే 1930ల వరకు బీర్‌ను గ్రీన్ కలర్ సీసాల్లోనే నింపేవారు. కాగా 1930లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీ కెమిస్ట్‌లు బీర్‌ను డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉండే సీసాల్లో నింపడంవల్ల మరింత ఎక్కువ సేపు తాజాగా ఉంటుందని, దీనికి తోడు సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఉంటుందని గుర్తించారు. దీంతో అప్పటి నుంచి బీర్‌ను డార్క్ బ్రౌన్ కలర్ సీసాల్లో నింపి అమ్మడం మొదలు పెట్టారు. డార్క్ బ్రౌన్ కలర్ కాకుండా ఇతర కలర్లలో ఉండే సీసాల్లో బీర్ నింపితే సూర్యుని నుంచి వచ్చే కిరణాలు బీర్‌తో చర్య పొందుతాయని, దీంతో బీర్ కొంత సేపటికి వాసన వస్తుందని గుర్తించారు. అందువల్లే డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉండే బీర్ సీసాలను వాడడం మొదలు పెట్టారు. అలా ఆ సీసాల్లో బీర్‌ను నింపి అమ్మడం కొనసాగుతూ వస్తోంది.
Advertisements
Advertisements
అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రౌన్ గ్లాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో గ్రీన్ కలర్ బాటిల్స్ ను బీర్ కోసం ఎక్కువగా ఉపయోగించారు. తరువాత మళ్లీ బ్రౌన్ కలర్ సీసాలనే వాడినా కొందరు అప్పటి నుంచి గ్రీన్ కలర్ సీసాలను ప్రెస్టిజ్‌కు సింబల్‌గా వాడుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం డార్క్ బ్రౌన్, గ్రీన్, క్లియర్ సీసాల్లోనూ బీర్‌ను అందిస్తున్నారు. కానీ సూర్యుని నుంచి కిరణాలు పడకుండా ప్రత్యేకంగా వాటిని కార్టన్‌లలో ప్యాక్ చేస్తారు. తరువాత వైన్ షాపులు, బార్లలో ఎలాగూ ఫ్రిజ్‌లో డార్క్ ప్లేసులో పెడతారు. కనుక వాటితో ఇబ్బంది లేకుండా పోయింది. అయినప్పటికీ బీర్‌లకు కేవలం ఆ 3 కలర్ల గ్లాస్‌లనే ఉపయోగిస్తూ వస్తున్నారు.