Advertisement
భూమిపై మనుషులతోపాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిల్లో పక్షులు కూడా ఉన్నాయి. భిన్న జాతులకు చెందిన పక్షులు అనేక దేశాల్లో మనకు కనిపిస్తుంటాయి. అయితే సాధారణంగా పక్షి.. అంటే.. దాదాపుగా ఏ పక్షి అయినా సరే గాల్లో ఎగురుతుంది. కానీ కోళ్లు ఎగరలేవు. పక్షి జాతికి చెందినా కోళ్లు ఇతర పక్షుల్లా గాల్లో ఎగరలేవు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? అవి ఎందుకు గాల్లో ఎగరలేవు ? అంటే..
కోళ్లు గాల్లో ఎగురుతాయి. కానీ కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే అవి ఎగురుతాయి. ఇతర పక్షుల్లా గంటల తరబడి ఎగరలేవు. ఎందుకంటే.. వాటి శరీరం ఇతర పక్షుల కన్నా కొంచెం ఎక్కువ సైజులో ఉంటుంది. అందువల్ల ఆ శరీరం గాల్లోకి ఎగరాలంటే వాటి రెక్కలు ఇంకాస్త పెద్దగా ఉండాలి. కానీ ఆ రెక్కలు చిన్నగా ఉంటాయి. అందుకనే అవి గాల్లో అంత ఎక్కువ సేపు ఎగరలేవు.
Advertisement
అయితే మనుషుల సంరక్షణలో కాకుండా అడవుల్లో పెరిగే కోళ్లు ఇంకొంచెం ఎక్కువ సేపు ఎగరగలవు. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. నిజానికి ఒకప్పుడు కోళ్లన్నీ కొంచెం ఎక్కువ సేపే ఎగిరేవి. కానీ మనుషుల సంరక్షణలో అవి ఎగరడం మానేశాయి. అంటే.. వాటికి ఆ అవసరం లేకుండా పోయింది. ఆహారం, నీళ్లు దొరకడమే కాదు.. వాటికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండవు. అందువల్ల అవి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవు. దీంతో అవి ఎగరడం తగ్గించాయి. అలా అలా కోళ్లు పరిణామం చెందాయి. అందుకనే అవి ఎక్కువ సమయం పాటు ఎగరడం లేదు. అయినప్పటికీ ఇతర పక్షులతో పోలిస్తే కోళ్ల రెక్కలు వాటి శరీర నిర్మాణానికి తగినట్లుగా ఉండవు. అందువల్ల అవి ఎక్కువ సేపు గాల్లో ఎగరలేవు. ఇదీ.. దాని వెనుక ఉన్న అసలు కారణం..!
Advertisements