Advertisement
మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా నటులు ఉంటారు అనే విషయం తెలిసిందే. ఆ రెండు జిల్లాల నుంచే రచయితలు దర్శకులు ఎక్కువగా వచ్చారు. అయితే పాలకొల్లు ప్రాంతం నుంచి మాత్రం నటులు ఎక్కువగా ఉంటారు. అసలు ఎందుకు అంత బాగా నటులకు ఆ ప్రాంతం క్లిక్ అయిందో చూద్దాం. పాలకొల్లు ప్రాంతం త్వరగా వ్యాపారపరంగా అభివృద్ధి చెందింది. గోదావరికి వారధి నిర్మాణం జరగక ముందు నరసాపురం నుండి పాలకొల్లు వరకూ కల గోదావరి పరీవాహక ప్రాంతం మీదుగా కోనసీమ ప్రాంతానికి వ్యాపారం ఎక్కువగా.
Also Read:అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?
Advertisement
విస్తారమైన వనరులు ఎక్కువగా ఉండటంతో కళా సాంస్కృతిక రంగాలు బాగా వృద్ధి చెందాయనే చెప్పాలి. ఆ విధంగానే పాలకొల్లు ఒక సాంస్కృతిక కేంద్రంగా మారింది. కళాకారులు పలు దేశాలకు కూడా వెళ్ళే వారు. వారిలో నాటకరంగ కళాకారులు ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతం యాస కూడా బాగా కలిసి వచ్చింది. వెటకారపు పాళ్ళు ఎక్కువగా ఉండటం తో జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు.
Advertisements
పాలకొల్లును నాటకరంగంలో అగ్రగామిగా నిలపడానికి గాను… నాటకపరిషత్ ను ఏర్పాటు చేసారు. ప్రదర్శనకు సౌకర్యాలు కలిగిన కళాక్షేత్రం కూడా వారు ఏర్పాటు చేసుకోవడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా వెళ్ళడం, వాళ్లకు నగదు బహుమతి లాంటివి ఇవ్వడం జరిగాయి. పాలకొల్లు నాటకరంగాన్ని ప్రోత్సహించిన వారిలో వారిలో దాసరి నారాయణరావు, కోడి రామక్రిష్ణ వంటి ప్రముఖ దర్శకులు ముందు వరుసలో ఉన్నారు. నాటకాలలో టాలెంట్ ఉన్న వాళ్ళను సినిమాల్లోకి తెచ్చారు.
Advertisements
Also Read:బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?