Advertisement
మాములుగా అద్దం పగిలితే ఎలా పగులుతుంది…? సరిగా దెబ్బ తగిలితే ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. మనం ముఖం చూసుకునే అద్దం అయితే అలానే పగిలిపోతుంది. అయితే కారు అద్దామో, లారీ అద్ధమో, బస్సు అద్దమో పగిలితే అలా ఉండదు. ఏదైనా దెబ్బ తగిలితే చిన్న చిన్న ముక్కలు అవుతుంది. అలా జరగడానికి ప్రధాన కారణం బస్సు అద్దాలకు రెండింటి మధ్యలో అభ్రకం పొరను పెట్టి జోడిస్తారు.
Also Read:దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఏ షాప్ లో బంగారం బెస్ట్…?
దానితో అద్దాలు అసాధారణ గట్టితనం తో/లో ధృఢంగా ఉండి చాలా కాలం ఉంటాయి. అభ్రకం పొర రెండు అద్దాల మధ్య ఉండటంతో ప్రమాదవశాత్తు ఏదైన రాయి, ఇనుము లాంటివి తగిలిన లేదా బులెట్ తగిలినా … వద్దనే అంత మేర మాత్రమే రంధ్రం పడుతుంది. అభ్రకం అంటే… మైకా అన్నట్టు. అభ్రకం లేదా మైకా అనేది ఖనిజాల సమూహం. వివిధ లోహాలతో ఉన్న అల్యుమినోసిలికేట్‌లు అన్నమాట. ఇది చక్కని పలకలుగా విడివడి ఉండటంతో అద్దం పగలగుండా ఉంటుంది.
Advertisement
Advertisements
మైకా అనేక దగ్గర సంబంధం గల పదార్థాలతో కూడి పరిపూర్ణ ఆధారభూత చీలికలను కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీనినే కాకి బంగారం అని కూడా పిలుస్తారు. ఇది అద్దపు పెంకుల మాదిరి ఉంటుంది. రసాయనికంగా చూస్తే… ఈ కాకి బంగారం మెగ్నీషియమ్, ఇనుము, సోడియమ్, పొటాషియమ్ తో కూడిన సిలికేట్. దీని పొరలు తేలికగా అతుక్కుని ఉంటాయి. అందుకే అద్దం ఒక్కసారిగా విరిగిపోకుండా ఉంటుంది.
Advertisements