Advertisement
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక పిచ్చి అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఉండే బొంబాయి ప్రచారానికి చాలా మందికి ఆ పిచ్చి ఏర్పడుతుంది అనే మాట వాస్తవం. అసలు ఆ జాబ్ ను ఎందుకు అంతగా ఇష్టపడతారో ఒకసారి చూస్తే…
Also Read:సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?
వేరే ఏ జాబ్ చూసినా సరే వీకెండ్ అనేది ఒకటే. కాని దానికి రెండు ఉండటం చాలా మందికి ఇష్టం. రెండవ విషయం ఏమిటంటే, ఇతర ఉద్యోగాలలో ఎక్కడా కూడా ఇక్కడ వచ్చినంత డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు. మూడో విషయం… సాఫ్ట్‌వేర్ ప్రజలు ఆన్‌సైట్‌లకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే వేరే దేశాలకు వెళ్ళవచ్చు. అన్నీ బాగుంటే అక్కడే సెటిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ.
Advertisement
నాలుగో విషయం ఇంటి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా పని చేసుకునే అవకాశం ఉంటుంది. అయిదవ విషయం పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ వస్తే ఎవరూ ఇంట్లో ఉండరు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మన ఇష్టం. రెస్టారెంట్లు, అవుటింగ్‌లు, డిస్కో పబ్బులు వంటి పార్టీలకు ఎక్కువగా వెళ్ళవచ్చు. చెప్పుకోవడానికి ఇలా చాలానే ఉన్నాయి.
Advertisements
అంటే చెప్పుకోవడానికి బాగుండేవి అవి… టార్చర్ చేసేవి మరికొన్ని ఉన్నాయి. రోజువారీ రిపోర్టింగ్‌లు, రోజువారీ సమావేశాలు, షరతులు, అవసరాలు, నమూనాలు, ఎస్ ఎల్ ఏలు ఎస్కలేషన్స్, సవాళ్లు, కట్టుబాట్లు, ప్రెజెంటేషన్లు, ఒత్తిడి, బర్న్‌అవుట్‌లు ఎక్కువగా ఉండి టార్చర్ చేస్తూ ఉంటాయి.
Advertisements
Also Read:అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?