Advertisement
సాధారణంగా హాస్పిటళ్లలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తెలుపు రంగు దుస్తులు వేసుకుని మనకు కనిపిస్తారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సరే తెలుపు రంగులోనే వారు దుస్తులు ధరించి మనకు దర్శనమిస్తారు. అయితే ఆపరేషన్లు చేసే సమయంలో గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరిస్తారు ? అవును.. చూశారు కదా..? అయితే ఇందుకు కారణమేమిటి ? వారు ఆ రెండు కలర్లకు చెందిన దుస్తులనే ఆపరేషన్లు చేసేటప్పుడు ఎందుకు ధరిస్తారు ? ఇతర రంగులకు చెందిన దుస్తులను ఎందుకు ధరించరు ? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అంటే…
ఇతర రంగులను చూసి చూసి ఒక్కసారిగా తెలుపు రంగును చూస్తే మన కళ్లకు ఏదీ కనిపించదు. అంధత్వం వచ్చినట్లు కొన్ని క్షణాల పాటు మనకు ఏదీ కనిపించదు. ఈ క్రమంలో వైద్యులు ఆపరేషన్లు చేసేటప్పుడు గనక తెలుపు రంగు దుస్తులను ధరిస్తే రోగి శరీరాన్ని, రక్తాన్ని చూసి చూసి పక్కన, ఎదురుగా ఉండే ఇతర వైద్యులు, సిబ్బందిని చూస్తే.. వారు కూడా తెలుపు రంగు దుస్తులను ధరించి ఉంటారు కనుక వారిని చూసే డాక్టర్లకు ఏదీ కనిపించదు. ముందు చెప్పినట్లు కొన్ని క్షణాల పాటు అంతా బ్లైండ్ అయిపోతుంది. దీంతో ఆపరేషన్‌పై వైద్యులు ఏకాగ్రత పెట్టలేరు. ఫలితంగా ప్రమాదం జరిగే చాన్స్ ఉంటుంది. అందుకనే వారు కేవలం ఆపరేషన్లు చేసేటప్పుడు మాత్రమే గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులను ధరిస్తుంటారు. మిగిలిన సమయాల్లో మనకు తెలుపు రంగు దుస్తులను ధరించి కనిపిస్తారు.
Advertisement
Advertisements
అయితే గ్రీన్ లేదా బ్లూ నే ఎందుకు ? ఇతర రంగుల దుస్తులు కూడా ధరించవచ్చు కదా..? అంటే.. వర్ణపటంలో ఎరుపు రంగుకు గ్రీన్, బ్లూ కలర్లు అపోజిట్ కలర్లుగా ఉన్నాయి. రోగి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కనుక దానికి అపోజిట్ కలర్లు అయిన గ్రీన్ లేదా బ్లూ కలర్‌నే వారు ఆపరేషన్ చేసే సమయంలో చూడాలి. దీంతో రోగి ఆపరేషన్‌పై వారు మరింత ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. ఎరుపు రంగులో ఉండే రోగి రక్తాన్ని చూస్తూ.. గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరించి ఉండే వైద్యులు, సిబ్బందిని చూస్తే దృష్టి సరిగ్గా ఉంటుంది. దీని వల్ల పైన చెప్పినట్లు ఎలాంటి దృష్టి అంతరాయం ఏర్పడదు. అందుకనే గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులను వైద్యులు, సిబ్బంది ఆపరేషన్లు చేసే సమయంలో ధరిస్తుంటారు.
Advertisements